“కృష్ణా” జిల్లా “వైకాపా అభ్యర్ధుల” లిస్టు ఇదే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా అభ్యర్దిలని ప్రకటించలేదు.వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన పాదయాత్రలో భాగంగా కొంతమంది.

 Ysrcp Unofficial Announcement Krishna District Mla Members-TeluguStop.com

అభ్యర్ధుల పేర్లని ప్రకటించాడు.అయితే ఈ క్రమంలోనే రాజకీయాలలో చైతన్యం కలిగిన జిల్లాగా పేరు ఉన్న కృష్ణా జిల్లాపై జగన్ ఎంతో శ్రద్ద కనబరుస్తున్నారు అందకే ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడుతాను అని హామీ కూడా ఇచ్చేశారు.

అంతేకాదు ఏ జిల్లాకీ కూడా ఇప్పటి వరకూ అభ్యర్ధులని డిసైడ్ చేయని జగన్ ఈ జిల్లాకి మాత్రం ఆఫ్ ది రికార్డ్ ప్రకటించాడు

ప్రకటించిన అభ్యర్ధులని వారి వారి పనులు చేసుకోండి అని కూడా చెప్పేశాడట ఇప్పటికే వారు తమ వ్యూహాలతో దూసుకు వెళ్తున్నారు.అయితే కృష్ణాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొన్ని కొన్ని టిక్కెట్లు మినహా మిగతావి ప్రకటించారని తెలుస్తోంది.అయితే ఈ లిస్టు ని ఒక్క సరి పరిశీలిస్తే

విజయవాడ వెస్ట్‌:

వెస్ట్ నుంచీ వైసీపి తరువున ఈసారి వెల్లంపల్లి పోటీ చేయనున్నారని తెలుస్తోంది గతంలో వెల్లంపల్లి బీజేపి ,తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్న సమయంలో అప్పటి వైసీపి అభ్యర్ధి జలీల్ఖాన్ పై పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇటీవల బీజేపి ని విడిచి వైసీపి కి వెళ్ళిన వెల్లంపల్లి కి జగన్ టిక్కెట్టు ఖాయం చేసినట్టుగా తెలుస్తోంది

విజయవాడ సెంట్రల్‌:

ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే వంగవీటి రాధాకి ఈ ప్లేస్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది…గత ఎన్నికల్లో రాధాకృష్ణ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి…గద్దె రామ్మోహన్‌రావుపై ఓడిపోయినా సంగతి తెలిసిందే అయితే తనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న విజయవాడ సెంట్రల్‌ నుంచే తాను పోటీ చేస్తానని చెప్పడంతో జగన్ కూడా సరే అన్నట్లుగా తెలుస్తోంది

విజయవాడ తూర్పు :

తూర్పు నుంచీ చూస్తే తాజగా పార్టీ లో చేరిన మాజీ టీడీపి నేత యలమంచిలి రవి ఇక్కడి నుంచీ పోటీ చేస్తారని ఫిక్స్ చేసుకోవచ్చు అంటున్నారు గతంలో ఇక్కడ నుంచి టిడిపి సీనియర్‌ నాయకుడు ‘దేవినేని నెహ్రూ’ను ‘రవి’ ఓడించారు.ఆ స్థానంలో మరొక బలమైన అభ్యర్ధి లేకపోవడంతో జగన్ రవి కే చాన్స్ ఇచ్చారని అంటున్నారు

మైలవరం:

టీడీపీ పార్టీ లో జగన్ పై నిత్యం నిప్పులు చెరిగే నేత మంత్రి దేవినేని ఉమా.జగన్ ని నోరేసుకుని టార్గెట్ చేసే ఏకైక వ్యక్తి.అయితే జగన్ ఈ సారి ఉమా కి చెక్ పెట్టడానికి పక్కా ప్లాన్డ్ గా వెళ్తున్నారని తెలుస్తోంది.

అందుకే ఈ స్థానంలో ఎంతో ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు అందులో భాగంగానే ఉమా సామాజిక వర్గానికి చెందిన “వసంత కృష్ణప్రసాద్‌” ను బరిలోకి దించాలని భావిస్తున్నారు

పెడన:

పెడన నుంచీ వైసీపి సీనియర్ నేత పోటీ ఖాయం అయ్యింది గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన వేదవ్యాస్‌ టిడిపిలో చేరిపోయారు.బిసీలు అధికంగా ఉన్న ఇక్కడ నుంచి ‘జోగి’ అయితే విజయం సాధించగలరని ‘జగన్‌’ నమ్ముతున్నారట.అందుకే…ఇక్కడ నుంచి ‘జోగి’ని రంగంలోకి దింపుతున్నారట.

తిరువూరు:

ఈ స్థానం రక్షణనిధికే సొంతం ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచీ రక్షననిది గెలుపు పక్కా అనే టాక్ తెలుగుదేశం పార్టీలో సైతం వినిపించడంతో జగన్ ఈ పేరునే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది

నూజివీడు:

ఇక్కడ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు పోటీ చేస్తారు.గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధించిన జమీందార్‌…మేకా…పార్టీ మారతారని వార్తలు వచ్చినా.పార్టీలోనే కొనసాగారు.దీంతో.ఈయనకు కూడా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గుడివాడ:

ఎన్టీఆర్‌ స్వంత నియోజకవర్గమైన గుడివాడలో.మళ్లీ ‘కొడాలి నాని’నే పోటీ చేస్తారు.

ఆయన మరోసారి విజయం సాధిస్తారని వైకాపా శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి

కైకలూరు:

ఈ స్థానం నుంచి దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తారని ‘జగన్‌’ తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు.గత ఎన్నికల్లో బిజెపి-టిడిపి అభ్యర్థిపై భారీ తేడాతో ఓడిపోయిన ‘ఉప్పల రామప్రసాద్‌’ను ‘జగన్‌’ పక్కకు తప్పించారు.


అవనిగడ్డ:

గత ఎన్నికల్లో పోటీ చేసిన సింహాద్రి రమేష్‌నే మళ్లీ బరిలోకి దింపడం ఖాయం.ఆయన ఈసారి గెలుస్తారని ‘జగన్‌’ భావిస్తున్నారట.అందుకే…ఆయనకు సీటు ఖరారు చేశారని చెబుతున్నారు.


పెనమలూరు:

గత ఎన్నికల్లో వైకాపాకు ఇక్కడ నుంచి భారీ దెబ్బ తగిలింది.ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ‘కుక్కల విద్యాసాగర్‌’ దాదాపు 31,138 ఓట్ల తేడాతో ఓడిపోయారు.దీంతో.ఇక్కడ అభ్యర్థిని మార్చాలని ‘జగన్‌’ నిర్ణయానికి వచ్చారు.అయితే మళ్ళీ ఈస్థానం నుంచీ గెలవాలని కుక్కల గట్టి పట్టు పట్టడంతో తడినే కొనసాగించే అవకాశం ఉండనే టాక్ కూడా వినిపిస్తోంది.


జగ్గయ్యపేట:

ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసిన ‘సామినేని ఉదయభాను’ మళ్లీ పోటీ చేస్తారు.కాపు కులంలో బలమైన నాయకుడిగా ఉన్న ‘భాను’కు మరోసారి అవకాశం ఇవ్వాలని ‘జగన్‌’ నిర్ణయించారట.దీంతో…ఆయనకు సీటు ఖాయమైనట్లే.


నందిగామ:

ఎస్సీ నియోజకవర్గమైన ఈ నియోజకవర్గంలో.గత ఎన్నికల్లో పోటీ చేసిన ‘జగన్మోహన్‌రావు’నే మళ్లీ పోటీ చేస్తారు.ఆయన కంటే బెటర్‌ అభ్యర్థి దొరికితే…ఆయనను మారుస్తారనే ప్రచారం ఉంది.


మచిలీపట్నం:

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ‘నాని’కే మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

గన్నవరం:

టిడిపి బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తారని పార్టీ అధినేత చెప్పినట్లు తెలుస్తోంది.‘యార్లగడ్డ’ అయితే.’వంశీ’కి మంచిపోటీ ఇవ్వగలరని ఆయన అంచనా వేస్తున్నారు.

పామర్రు:

గత ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచిన ‘ఉప్పులేటి కల్పన’ టిడిపిలో చేరడంతో.ఇక్కడ వైకాపాకు నాయకత్వ కొరత ఉంది.

ఇక్కడ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం వెతుకులాటలో ఉంది.మొత్తం మీద.ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ఫైనల్‌ చేసుకుని…’జగన్‌’ పోరాటానికి సిద్ధమయ్యారని జిల్లా నాయకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube