ఇకపై వాహనాలపై కుల మతాలు ఉండకూడదు

దేశ వ్యాప్తంగా నూతన ట్రాఫిక్‌ నిబంధనలు మరియు కొత్త చలాన రేట్లు సెప్టెంబర్‌ 1 నుండి అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే.కేంద్రం తీసుకు వచ్చిన కఠిన ట్రాఫిక్‌ చలాన విధానంను కొన్ని రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు.

 Displaysigns Depictingcaste Religionor Post On Vehicles Areban Rto-TeluguStop.com

ఇంకా కొత్త చట్టం గురించి ప్రచారం అయితే చేస్తున్నారు.కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త చలానాలను ప్రవేశ పెట్టడం లేదు.

రాజస్థాన్‌లో ఇంకా కొత్త ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంగన చలాన్‌ విధానంను అమలు చేయడం లేదు.ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ప్రజలకు కాస్త సమయం ఇవ్వాలని భావిస్తున్నారు.అయితే హెల్మెట్‌ లేని వారి నుండి వెయ్యి రూపాయలు వసూళ్లు చేసి వారికే హెల్మెట్‌ను ఇస్తున్నారు.

ఇక రాజస్థాన్‌ ప్రభుత్వం సొంతంగా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

కార్లు, బండ్లు ఇతర వాహనాలపై తమ పేర్లు, కులం లేదా మతం పేర్లు పెట్టడం, వారి వారి కులం లేదా మతంకు చెందిన జెండాలను పెట్టడం చేస్తున్నారు.

అందుకే ఇకపై వాహనాలపై ఎలాంటి పేర్లు ఉండవద్దని, అలాగే మతాలకు సంబంధించిన సూచికలు జెండాలు కూడా ఇకపై వాహనాలపై ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.నెల రోజుల్లో మొత్తం అన్ని కూడా తొలగించాలని, ఆ తర్వాత కూడా పేర్లు ఉన్నట్లయితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పెద్ద మొత్తంలో ఫైన్‌లు విధించడంతో పాటు అవసరం అయితే వెయికిల్‌ను స్వాదీనం చేసుకోవడం కూడా జరుగుతుందని హెచ్చరించారు.ఇదే విధానంను మొత్తం దేశ వ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందా అంటూ సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube