మీ తప్పును మాపై రుద్దకండి అంటూ కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో యూరియ కొరత తీవ్రంగా ఉంది.యూరియా కోసం రైతులు పెద్ద లైనులో నిల్చోవడం, యూరియా కోసం వెళ్లిన రైతులు తీవ్ర అనారోగ్యం పాలవ్వడం మనం రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం.

 Ministerkishan Reddy Fireon Telanganagovernment Bjp-TeluguStop.com

మీడియాలో వస్తున్న విమర్శలపై తాజాగా ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రం నుండి సరిపడ యూరియా రాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.కేంద్రం యూరియాను సరిపడ పంపించడంలో విఫం అయ్యిందని, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా యూరియాను తరలిస్తున్నారు అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

బీజేపీ తీరుతో తెలంగాణలో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణలు చేయడం జరిగింది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరియు ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై బీజేపీ నాయకుడు కేంద్ర సహాయమంత్రి కిషన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.

తెలంగాణ ప్రభుత్వంకు ముందస్తు ప్రణాళిక లేక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే 50 శాతం యూరియాను కేంద్రం పంపించిందని, మరో 50 శాతంను మరో రెండు మూడు రోజుల్లోనే పంపించబోతున్నారు.

మొదటే ఎక్కువ యూరియా అడగకుండా ఇప్పుడు ఎక్కువ యూరియా కావాలంటూ కేంద్రంను బ్లేమ్‌ చేయడం ఏంటంటూ కిషన్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.రాష్ట్ర ప్రభుత్వం తప్పును కేంద్రంపై రుద్దేందుకు ప్రయత్నించడంతో పాటు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తెలంగాణ రాష్ట్రంకు సరిపడ యూరియాను కేంద్రం సరఫరా చేస్తుందని కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube