కాలిఫోర్నియాలో ఎన్నారై కుటుంబం మీద దాడి! కోమాలో బాలిక..కరిగిన అమెరికన్ల హృదయాలు !

కాలిఫోర్నియాలోని సన్నీవేల్ లో రాజేష్ నారాయణ్ అనే భారతీయ కుటుంబం నివసిస్తుంది.రాజేష్ తన కూతురు ద్రితి(13 ) మరియు కొడుకు తో కలిసి వారి ఇంటికి దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి కారుతో వారిని వెనకనుండి ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో రాజేష్ మరియు అతని కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ద్రితికి తలకి తీవ్రగాయాలవడంతో ఎమర్జెన్సీ కేర్ లో చికిత్స పొందుతుంది.చికిత్సకు 5 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.

ద్రితి వైద్యం కోసం వారి కుటుంబ సభ్యులు go fund me లో విరాళలు కోసము చేయగా ,ఇది సోషల్ మీడియా లో తెలుసుకున్న దాదాపు 12,360 మంది దాతలు ధిర్తీ కోసం సహాయము చేసారు.

వారిచ్చిన సొమ్మంతా కలిపి రూ.నాలుగు కోట్లపైగా ఉండటంతో వారం లో కావాల్సిన డబ్బు సమకూరడంతో వైద్యులు కావాల్సిన చికిత్సలు చేసారు.తమ బిడ్డకు వైద్యం అందించగలుగుతున్నామని ధిర్తి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

ఆక్సిడెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.పోలీసుల విచారణలో వారు ముస్లింలు అనుకోని వారిపై కావాలనే ఈ దాడి చేసినట్టుగా చెప్పాడు.అతను గతం లో ఆర్మీ లో పనిచేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు.

ద్రితి తొందరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నాం.

మీరు డొనేట్ చేయాలి అంటే లింక్ లో చేయొచ్చు.Dhriti GoFund Me

.