కరోనా వ్యాప్తి పై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆందోళనకర వ్యాఖ్యలు.. .

యావత్ ప్రపంచంలోని ప్రజలకు, దేశాలకు గత సంవత్సరం మిగిల్చిన విషాదచాయలు మనసులో నుండి ఇంకా చెరిగిపోక ముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందనే వార్త గుండెల్లో అణు బాంబులను పేల్చుతుందట.ఈ రక్కసిని తరిమివేయడానికి కోవిడ్ టీకా తయారు అయినా ఇంకా కరోనా భయం మాత్రం అలాగే ఉంది.

 World Health Organization, Alarming, Comments, Corona Spread, Who Sensational Co-TeluguStop.com

ఈ నేపధ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఒక భయంకరమైన నిజాన్ని మరోసారి ప్రకటించింది.కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి ఇప్పుడ‌ప్పుడే త‌గ్గే అవ‌కాశాలు లేవ‌ని ప్ర‌క‌టించింది.

కాగా ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివరికల్లా క‌రోనా వ్యాప్తి ఆగిపోతుంద‌నుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని, అలాంటి ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని స్ప‌ష్టంచేసారు.కానీ సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆస్ప‌తుల పాల‌య్యేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం దేశంలో రూపాంత‌రం చెందుతున్న వైరస్ ర‌కాలు‌ ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరిస్తూ, మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.దీన్నిబట్టి అర్ధం అయ్యేది ఏంటంటే.

కరోనా నివారణకు పాటించవలసిన రక్షణ చర్యలను మరచిపోకుండా కొనసాగిస్తూ, కాస్త కోరికలను అదుపు చేసుకుని గుంపుల్లో కలవకని అర్ధం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube