‘కబాలి’ ఫలితమే ‘కాలా’కి, ఎందుకంటే..?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గత కొంత కాలంగా సరైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అవుతున్నాడు.ఆయన సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 Kaala Results-TeluguStop.com

రజినీకాంత్‌ ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత అటువంటి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.అడపా దడపా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

‘కబాలి’ చిత్రంపై అంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.ఏమాత్రం ఆకట్టుకోని ఆ చిత్రంను రజినీకాంత్‌ ఎందుకు ఒప్పుకున్నాడా అని ఫ్యాన్స్‌ కూడా అనుకున్నారు

‘కబాలి’ చిత్రం ఫ్లాప్‌ మర్చిపోకుండానే అదే చిత్ర దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో తాజాగా ‘కాలా’ చిత్రాన్ని చేశాడు.స్టార్‌ హీరో తనకు ఒక ఫెయిల్యూర్‌ ఇచ్చిన దర్శకుడితో పని చేసేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది.కాని రజినీకాంత్‌ మాత్రం కారణం ఏంటో కాని రంజిత్‌ పాతో పని చేసేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.‘కబాలి’ ఫలితంను మర్చి పోయాడేమో ‘కాలా’ను ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు.

సరే కబాలి విషయంలో జరిగిన తప్పులను మళ్లీ జరగకుండా చూసి, కాలా చిత్రాన్ని సక్సెస్‌ చేస్తాడని అంతా అనుకున్నారు.కాని కాలా చిత్రం కూడా కబాలి దారిలోనే వెళ్తుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

‘కాలా’ చిత్రం విడుదలకు రంగం సిద్దం అయ్యింది.సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ‘కాలా’ చిత్రం వచ్చే వారంలో విడుదల కాబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ‘కాలా’ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.ఈ ట్రైలర్‌లో రజినీకాంత్‌ లుక్‌ మరియు సీన్స్‌ ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి.

సినిమా ఎలా ఉన్నా కూడా ట్రైలర్‌ చూస్తే వావ్‌ సినిమా బాగుంటుందేమో అనిపించాలి.కాని కాలా ట్రైలర్‌ సినిమాపై నమ్మకంను కోల్పోయేలా చేసింది.
‘కాలా’ చిత్రంలో రజినీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌లో అర్థం అవుతుంది.కబాలి సినిమాలో మాదిరిగా స్క్రీన్‌ప్లే అంతా కూడా గందరగోళంలా ఈ చిత్రంలో కూడా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ట్రైలర్‌ను చూసి సినిమా ఫలితాన్ని అంచనా వేయలేం.అందుకే ‘కాలా’ చిత్రంపై కాస్త నమ్మకం పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు కూడా ‘కాలా’ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube