ఐపీఎస్ ఆఫీస‌ర్ కు లిప్ స్టిక్ పెట్టిన కూతురు.. వీడియో వైర‌ల్‌

ఈ భూమ్మీద తండ్రి, బిడ్డ‌ల బంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.ఎందుకంటే త‌న‌కు ఎంత‌మంది కొడుకులు ఉన్నా స‌రే బిడ్డ మీద ప్ర‌త్యేక‌మైన ప్రేమ‌ను పెంచుకుంటాడు ఆ తండ్రి.

 Daughter Puts Lipstick On Ips Officer Video Viral Details, Video Viral, Dad Love-TeluguStop.com

అందుకే అత‌న్ని కూతురు కూడా అంత‌లా ప్రేమిస్తుంది.ఏ ఇంట్లో చూసినా స‌రే.

బిడ్డ‌ను మ‌హారాణిలా చూసుకుంటాడు ప్ర‌తి తండ్రి కూడా.ప్ర‌తి కూతురుకు త‌న తండ్రి హీరో కాక పోవ‌చ్చు గానీ.

ప్ర‌తి కూరుతును మాత్రం త‌న తండ్రి మ‌హారాణి లాగే భావిస్తాడు.త‌న ఇంట్లో పుట్టిన మ‌హారాణి అంటూ నెత్తిన పెట్టుకుంటాడు.

అందుకే కూతురు ఏది అడిగినా కాద‌న‌కుండా ఇస్తుంటాడు.

ఇలా తండ్రి, కూతురు ప్రేమ‌ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతుంటాయి.

వీటికి వ్యూస్ కూడా విప‌రీతంగానే వ‌స్తుంటాయి.అయితే ఇలాంటి వీడియోలు నిజంగానే గుండెను హ‌త్తుకునేలా ఉంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా పాపుల‌ర్ అవుతోంది.దాన్ని చూసిన వ‌రాంతా కూడా వావ్ అంటున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ గా ప‌నిచేస్తున్నారు.సివిల్ డిపార్టు మెంట్ లో ప‌నిచేస్తున్నారు.

పేరు విజయకుమార్.ఆయ‌న‌కు త‌న కూతురు అంటే చాలా ఇష్టం.

ఇక ఓ రోజు త‌న కూతురుతో ఆడుకుంటున్నాడు.

ఇలా ఆడు కుంటుండ‌గా.త‌న కూతురు పెదవులపై లిప్‌ స్టిక్ పూసింది.ఆమె చిన్న వ‌య‌సురాలు  కావ‌డంతో విజ‌య్ కుమార్ కూడా ఆమెను ఏమీ అన‌కుండా చూస్తూ ఉండిపోయాడు.

ఇక ఇదంతా ఆయ‌న వీడియోలో రికార్డు చేయించాడు.దాన్ని సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయ‌డంతో అది కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అయిపోయింది.

అంటే తండ్రికి కూతురు మేక‌ప్ వేస్తోంద‌న్న మాట‌.ఇలా తండ్రి కూతురు బంధానికి సంబంధించిన ఈ వీడియో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

దీనిపై నెటిజ‌న్లు కూడా చాలా రకాల కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube