ఉలిక్కిపడ్డ ట్రంప్..నల్లజాతీయుల భారీ ర్యాలీ..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 వ తేదీన జరగనున్న నేపధ్యంలో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన ఉత్కంట నెలకొంది.మళ్ళీ పట్టాభిషేకానికి ట్రంప్ ఉవ్విళ్లూరుతుండగా ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ పట్టుదలతో ఉన్నారు.

 Black Lives Matter, Donald Trump,  Civil Rights Leader Rev. Kevin Mccall , Ameri-TeluguStop.com

అయితే ట్రంప్ విజయానికి అడ్డు కట్ట వేసే ట్రంప్ తప్పిదాలు కాచుకుని కూర్చున్నాయి.కరోనా కట్టడి చేయలేక పోవడం తో అమెరికన్స్ నుంచీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ ఆ తరువాత నల్ల జాతీయుల హత్యల సమయంలో ప్రవర్తించిన తీరు పట్ల ప్రపంచం మొత్తం ద్వేషించేలా చేసింది.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కరోనా నిర్లక్ష్యం ఘటనతో పోల్చుకుంటే తక్కువ ప్రభావం చూపించవచ్చని అనుకున్నారు కానీ రోజు రోజుకి నల్లజాతీయుల నిరసన ప్రదర్శనలు ఆకాశాన్ని అంటుతున్నాయి.అమెరికా పోలీసులు నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ మెడ మీద కాలు ఉంచి ఊపిరి ఆడకుండా చంపిన ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం చేయలేక పోవడం పై వారు మండిపడుతున్నారు.

రోడ్లపైకి పెద్ద ఎత్తున చేరుకున్న నల్లజాతీయులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.


Telugu America, Black Matter, Civilrev, Donald Trump, George Floyd-

న్యూయార్క్ టైం స్క్వేర్ నుంచీ ట్రంప్ టవర్ వరకూ సాగిన ఈ ప్రదర్శన దద్దరిల్లిపోయింది.అమెరికా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.మా మేడపై మీ మోకాళ్ళు తీయండి అనే నినాదంతో నిరసన ప్రదర్సనలు చేపట్టారు.

జాత్యహంకారానికి లోనయిన అన్ని కుటుంభాలు ఈ ప్రదర్శనలో భాగమయ్యాయి.పౌర హక్కుల కార్యకర్తలు కెవిన్ మెక్ కాల్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు ప్రదర్శించారు.

మా సమస్యలు తీర్చే వరకూ తాము న్యూయార్క్ విడిచి వెళ్ళేది లేదని చెప్పిన నిరసన కారులు న్యాయం చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube