ఉగ్రవాదుల చెరలో తెలంగాణా వాసులు..

దేశం కాని దేశం లో పని కోసమని వెళ్లిన తెలంగాణా వాసులకి ఉగ్రవాదుల రూపంలో సమస్యలు ఎదురయ్యాయి.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది తెలంగాణా వాసులు ఉగ్రవాదుల చేతిలో భందీలుగా మారిపోయారు.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ వార్తా సంచలనం సృష్టిస్తోంది.పొట్టకూటి కోసం అందరూ దుబాయి లాంటి దేశాలు వెళ్తోంటే వీరు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకి ఎలా వెళ్ళారు అనే ఆలోచనలో ఉన్నారు పోలీసులు అసలు వివరాలలోకి వెళ్తే .

ఐఎస్‌ ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే బాగ్దాద్‌ సరిహద్దు ప్రాంతమైన కిర్గ్‌ లో ఓ ప్రైవేటు కంపెనీ లో చేరడానికి దాదాపు 15 మంది నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి బతుకుదెరువు వెళ్ళారు.వీరికి ఎర్బిల్‌లో మంచి ఉపాధి చూపిస్తామంటూ ఏజెంట్లు నమ్మించి అక్కడికి వెళ్లిన తర్వాత పని అక్కడ కాదని చెప్పి ఉగ్రవాదులు ఉన్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు.


అంతేకాదు వాళ్ళు అక్కడ వారికి పని కూడా చెప్పకుండా హింసకి గురిచేస్తున్నారని తినడానికి తిండి నీళ్ళు కూడా ఇవ్వడం లేదని వాపోయారు.నమాజ్ చేయాలని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

వారు ఉంటున్న ప్రాంతం ఎప్పుడు తీవ్రవాదులకి నిలయమని ఎప్పుడు కాల్పులు జరుగుతూ ఉంటాయి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నామని వారు తమ గోడు చెప్పుకుంటున్నారు.

తమ రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని తమను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని భాదితులు కోరుకుంటున్నారు అయితే ఈ విషయంలో తెలంగాణా సర్కారు విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ తో త్వరలోనే సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube