ఇప్పటికి తెలిసిందా ప్రాంతీయ పార్టీల 'పవర్'

ఓడ ఎక్కేదాకా కూడా మల్లన్న.ఓడ దిగాక బోడి మల్లన్న ! అన్నట్టు ఇప్పటివరకు వ్యవహరించి కేంద్ర అధికార పార్టీ బీజేపీకి ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి.

 Narendra Modi Amit Shah-TeluguStop.com

అధికార పొగరు నెత్తికి ఎక్కడంతో మిత్రపక్షాలన్నిటిని దూరం చేసుకున్న ఆ పార్టీకి వరుసగా అపజయాలు ఎదురు అవ్వడంతో ఇప్పుడు తేరుకుని అందరి దగ్గరకు కాళ్లబేరానికి వెళ్తోంది.మునుపటిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో బొక్కబోర్లా పడడం ఖాయం అని గ్రహించిన బీజేపీ పెద్ద తలకాయలు అమిత్ షా , నరేంద్ర మోదీలు దూరం అయిన మిత్రులందరిని దగ్గరకు చేర్చుకునే పనిలో పడ్డారు.

దేశం లో ఉన్న ప్రాంతీయ పార్టీలంటే చాలా చులకనగా చూస్తూ .మీ అవసరం మాకేంటి అన్నట్టు ప్రవర్తిస్తూ కక్ష సాధింపుచర్యలకు దిగేవారు.దాదాపు ప్రతి మిత్రపక్షంతోనూ ఇదే విధంగా వ్యవహరించారు.ఫలితంగా.ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తరపున బీజేపీకి మద్దతుదారులు లేకుండా పోయారు.ఉన్న వారితో ఉపయోగం లేదు.

ఎన్డీఏలో ఉన్నా.బీజేపీని నమ్మే పార్టీలు లేవు.

ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన పరిస్థితేమీ కాదు.గత మూడేళ్లగా ఉన్నదే.

కాకపోతే ఇప్పుడే బీజేపీ అగ్రనేతలకు ఈ విషయం బాగా తెలిసొచ్చింది.

నాలుగేళ్ల పాటు శివసేన అనే మిత్రపక్షం ఉందని గుర్తించని.

అమిత్ షా .ఇప్పుడు అపాయింట్‌మెంట్ అడిగి.ఇచ్చిన సమయంలో ఉద్దవ్ ధాకరేను కలిసేందుకు ముంబై వెళ్తున్నారు.ఒక్క ఉద్దవ్ నే కాదు.మర్చిపోయిన స్నేహితులందర్నీ కలిసేందుకు “సంపర్క్ ఫర్ సమర్థన్ ” అనే కార్యక్రమం పెట్టుకున్నారు.వాస్తవానికి రాజకీయాల్లో అవసరాలే మిత్రులను నిర్ణయిస్తాయి.

గెలిచే ఊపు ఉంటే అమిత్ షా పరుగులు పెట్టాల్సిన పని లేదు కదా !
బీజేపీకి ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు.బాగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది.

కాంగ్రెస్‌తో ఎవరూ కలవరు.మేమేం చేసినా పడతారు అనుకునే వ్యూహంతో రెచ్చిపోయారు.

అదే ఇప్పుడు ఆ పార్టీకి చేటు తెస్తోంది.పరోక్షంగా సహకరిస్తున్న వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు.

ఇటువంటి దీన పరిస్థితికి బీజేపీ దిగజారిపోయింది.ఇదంతా ఖచ్చితంగా అమిత్ షా , నరేంద్రమోదీ వైఫల్యమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube