ఇకపై భర్త అలా శృంగారం చేస్తే...భార్య విడాకులు తీసుకోవచ్చు అంట.! షాకింగ్ తీర్పు!

భార్యభర్తల మధ్య గిల్లికజ్జాలు సహజం.కానీ ఆ గొడవలు శృతిమించితే దానికంటే నరకం మరొకటి ఉండదు.

 Divorce For Forced-TeluguStop.com

తన తల్లిదండ్రులను ,కుటుంబాన్ని,తను ఉన్న పెరిగిన చోటుని కాదని ఎవరో ముక్కుముఖం తెలియని పర్సన్ ని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో మరొక ఇంటికి చేరుకున్న అమ్మాయికి అక్కడ అంతా సవ్యంగా ఉంటే ఒకే.లేదంటే విడాకులు, మరీ కాదంటే ఆత్మహత్యలు.

దంపతులు రతిక్రీడలో పాల్గొనడంలో వింత ఏమి ఉండదు.కానీ ఇప్పుడు జీవిత భాగస్వామికి ఇష్టం లేకుండా చేసే బలవంతపు శృంగారం, అసహజ లైంగిక చర్యలపై విడాకులకు వెళ్ల వచ్చని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది.తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై విచారణ నిర్వహించిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని మన్నించింది

తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం తనను తరచూ కొట్టేవాడని, అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది.ఆమె విజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చగా హైకోర్టును ఆశ్రయించింది

అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేయలేకపోయారన్న దిగువ న్యాయస్థానం అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.ఇలాంటి చర్యలను ఇతరులెవ్వరూ చూడలేరని, వైద్యపరంగానూ ప్రతీసారి రుజువు చేయలేరని హైకోర్టు పేర్కొంది.ఈ కేసులో కట్నం కోసం డిమాండ్‌ చేయడం, భార్యను కొట్టడం వంటి వాటిని చూస్తే ఆమె భరించలేని పరిస్థితులను ఎదుర్కొన్నట్లు స్పష్టమవుతోందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎం.ఎస్‌.బేడి, జస్టిస్‌ హరిపాల్‌ వర్మతో కూడిన ధర్మాసనం పేర్కొంది.బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే విడాకులకు ప్రాతిపదికేనని ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది

తాజా ఈ తీర్పుతో మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.పెళ్లి ముసుగులో ఆడవారిపై ఇష్టం లేకుండా మ్యారిటల్ రేప్‌లు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి.ఇప్పటికైనా మగవారి ఆలోచనలో మార్పులు రావాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube