ఆన్ లైన్ లో ఆర్టీఏ సేవలు.. ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ !

తెలంగాణ రవాణా శాఖ వినియోగదారులకు గుడ్ న్యూస్ ను అందించింది.కరోనా విజృంభణ నేపథ్యంలో రవాణాకు సంబంధించిన సేవలను ఆన్ లైన్ పునరుద్ధరించింది.

 Telangan Governament, Rta Services Online, Driving License, Home-TeluguStop.com

వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం మరో ఆరు సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్ లో అడ్రస్ మార్పు, హేవీ లైసెన్స్ ఆమోదం, లెర్నర్ లైసెన్స్ వంటి సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చు.ఇప్పటికే ప్రభుత్వం డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను పొందడానికి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, ఇంటి నుంచే ఆన్ లైన్ లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పిస్తే చాలని రవాణాశాఖ పేర్కొంటోంది.అయితే ఇదివరకూ డ్రైవింగ్స్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఏ కార్యాలయాల చుట్టు వారాల తరబడి తిరిగాల్సిన పరిస్థితి.

తొందరగా లైసెన్స్ ను పొందేందుకు మధ్యవర్తులు, ఏజెంట్లకు కమీషన్ ఇస్తేనే పనులు ముందుకు సాగేది.దీంతో ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకుండానే వినియోగదారులు సేవలు పొందేలా చర్యలు తీసుకుంటోంది.

అయితే త్వరలో మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube