విషాదం : అమెరికా లోని టర్నర్ ఫాల్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయి మరో తెలుగు విద్యార్థి మృతి

ఓక్లహోమాలోని ఎత్తైన జలపాతంగా పరిగణించబడే టర్నర్ ఫాల్స్ వద్ద ఒక వ్యక్తి మునిగిపోయాడని సిటీ ఆఫ్ డేవిస్ అధికారులు తెలిపారు.ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగింది.

 Telugu Nri Student Naga Subash Moturu Died In Turner Falls,oklahoma-TeluguStop.com

బ్లూ హోల్ పూల్ వద్ద ఆదివారం టెక్సాస్‌లోని విచిత ఫాల్స్ కు చెందిన నాగా సుబాష్ మోతురు (26) లోతైన నీటి ప్రాంతంలో ప్రమాదవశాత్తు పడిపోయి ఈత కొట్టలేక మరణించినట్లు నగర అధికారి తెలిపారు.

సుబాష్ టెక్సాస్లోని విచిత ఫాల్స్ లోని మిడ్ వెస్ట్రన్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు.

మోతురు స్నేహితులను సందర్శించట్టానికి వెళ్లినట్లు తెలుస్తుంది.

టర్నర్ జలపాతం వద్ద ఇంతకముందు కూడా పలువురు మరణించారు.ఈ సంవత్సరంలో ఇదే మొదటి ప్రమాదం అని అధికారి తెలిపారు.కరోనా మహమ్మారి కారణంగా లైఫ్‌గార్డ్‌లు ఎవరూ విధుల్లో లేరు.

అమెరికా లోనే వున్నా సుభాష్ సోదరి తన తమ్ముడిని ఇండియా తీసుకువెళ్ళటానికి అందరూ సహాయం చేయాలిసిందిగా కోరింది.క్రింద వున్నా లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయొచ్చు అలాగే తోటి తెలుగు మిత్రులకి షేర్ చేసి సహాయం చేయగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube