అక్కడ లీటర్ పెట్రోల్ 57పైసలే..! ఏ దేశంలో తెలుసా .? ఆర్థిక సంక్షోభంలో ఉన్నా!

నేటి త‌రుణంలో మ‌న దేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే.ప్ర‌స్తుతం ఆయా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి.

 Petrol Price 57paise-TeluguStop.com

సెంట్ర‌ల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు క‌లిపి వాటి ధ‌ర‌లు రెట్టింపు మొత్తం పలుకుతున్నాయి.దీంతో జ‌నాల‌కు అంత ధ‌ర వెచ్చి వాటిని కొనుగోలు చేయ‌క త‌ప్ప‌డం లేదు

కానీ ఆ దేశంలో మాత్రం పెట్రోల్ ధర లీటర్ కు 57 పైసలు మాత్రమే.ఈ ధర చూడగానే ఆశ్చర్య పోయారా? ఆ దేశం డబ్బులు దండిగా ఉన్న దేశం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.అసలు కథ ఏంటో వివరాలు చూడండి!

ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతూ.ఆహార కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనుజులా దేశం.2018, జూన్ 2వ తేదీ నాటికి భారతీయ రూపాయితో పోల్చితే లీటర్ పెట్రోల్ కేవలం 57పైసలు మాత్రమే.ప్రపంచంలోనే అత్యంత ధర తక్కువగా.ఓ రకంగా చెప్పాలంటే ఫ్రీగా పెట్రోల్ ఇస్తున్న దేశంగా చెప్పొచ్చు.ఆ తర్వాత 19 రూపాయలతో ఇరాన్ రెండో దేశంగా నిలిచింది

ఓ వైపు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ వెనిజులా దేశం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లీటరు కేవలం 57 పైసలకు అందిస్తుంది.ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు ఆ దేశంలో ఉండటం ఓ కారణమైతే, , ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోలు పై రాయితీలు ఇస్తుండటం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పెట్రోల్ తక్కువ ధరకు లభించడానికి కారణం

ఇక భారీ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో రెండవ స్ధానంలో ఉన్న సౌదీ అరేబియాలో మాత్రం పెట్రోలు ధరల విషయంలో 13వ స్ధానంలో ఉంది.సౌదీ అరేబియాలో లీటరు పెట్రోలు ధర రూ.36.40 ఉండగా, ఇరాన్‌లో 18.88 రూపాయలకు, సూడాన్‌లో 22.93 రూపాయలకు లీటరు పెట్రోలు లభిస్తుంది.అయితే అత్యంత ఎక్కువ ధరకు పెట్రోలు దొరికే దేశం ఐస్‌ లాండ్.అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.144.96గా ఉంది.ఆ తరువాత స్ధానంలో హాంకాంగ్‌ ఉంది.హాంకాంగ్ లో లీటరు పెట్రోలు ధర రూ.144.31గా ఉంది

ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చమురు ఉత్పత్తి దేశాల్లో నార్వే ఒకటిగా ఉన్నప్పటికీ అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.138.20 గా ఉంది.ప్రజలందరూ ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించాలని ప్రభుత్వమే అక్కడ పెట్రోలుపై భారీగా పన్నులు విధిస్తుంది.

భవిష్యత్తులు చమురు నిల్వలు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా ముందు జాగ్రత్తగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube