పెద్ద హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.హీరో ఫైట్ చేసి చేసి అలసిపోతి, ఆడియెన్స్ చూసి చూసి అలసిపోతారని, వారికి స్పెషల్ ప్యాకేజ్ లాగా, కాసేపు మాస్ మసాలా విందు లాగా, అందాలతో, నృత్యాలతో అలరించేందుకు ఒక ఐటమ్ గర్ల్ ని తీసుకొస్తారు.
ఒకప్పుడు స్పెషల్ గా ఐటమ్ గర్ల్స్ ఉండేవారు.ఈ జనరేషన్లో కేవలం ఒక ఐటమ్ గర్ల్ స్టేటస్ తోనే స్టార్ గా వెలుగొందింది.
ఇక ఎప్పటినుంచైతే స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఐటమ్ గర్ల్స్ కి డిమాండ్ తగ్గిపోయింది.
ముమైత్ ఖాన్, అభినయ శ్రీ లాంటి వాళ్ళంతా సైడ్ అయిపోయరు.
శృతిహాసన్, తమన్నా, కాజల్ … ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్ చేసారు.ఇందులో తమన్నా వీలు చిక్కినప్పుడల్లా ఐటమ్ సాంగ్ కి రెడీ అంటోంది.
మీరు నిన్న చదివే ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జైలవకుశలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 50 లక్షలకు పైమాటే అని టాక్.ఇది రికార్డు రెమ్యునరేషన్ కాకపోయినా, స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఇంత చెల్లించడం చిన్న విషయం కాదు.రికార్డు గురించి మాట్లాడితే, కరెంట్ తీగలో స్పెషల్ సాంగ్ చేసిన సన్ని, 75 లక్షలు వసూలు చేసిందట.
సన్నితో పోల్చుకుంటే తమన్నా తీసుకునేది తక్కువే కాని, ఎందుకో, చేసే రెండుమూడు రోజుల వర్క్ కి 50 లక్షలు అంటే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది.