హైపర్ ఆదిని పిచ్చకొట్టుడు కొడతా అంటూ ఫేసుబుక్ లైవ్ లో శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు       2018-05-29   03:40:43  IST  Raghu V

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ వివాదం తెర మీదికి తీసుకొచ్చిన నటి.అంతకుముందు ఈమె అరవింద్ 2 ఇంకా కొన్ని సినిమాల్లో నటించింది..అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీ కి వస్తే క్యాస్టింగ్ కౌచ్ భూతం వారిని వాడుకొని వదిలేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది.తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదని , తెలుగు అమ్మాయిలు కూడా నార్త్ అమ్మాయిల కన్నా పోటీగా నటించగలరు అంటూ ఉద్యమం ప్రారంభించి న్యూస్ చానెల్స్ లో హల్ చల్ చేసింది.ఆ మధ్య కొన్ని కారణాల వల్ల ఆమె చేస్తున్న ఉద్యమం ఆగిపోయింది.అయితే అప్పుడప్పుడు ఫేసుబుక్ లైవ్ లో , మరియు ఫేసుబుక్ స్టేటస్ లతో వార్తల్లో నిలుస్తోంది.తాజాగా 27 వ తేదీన ఫేసుబుక్ లైవ్ లో జబర్దస్త్ షో ని , హైపర్ ఆదిని విమర్శిస్తూ ఫేసుబుక్ లో లైవ్ ఇచ్చింది.

అందులో జబర్ధస్త్ హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ‘హైపర్ ఆది.. మిమ్మిల్ని ఇంతక ముందు కలిశా.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చాలా గౌరవం ఉంది. మంచి రైటర్ మీరు. అవకాశాలు లేక ఇబ్బందులు పడే వారికి ‘జబర్దస్త్’ షో చాలా ఉపయోగకరంగం ఉంది.

మీరు వేషాల కోసం వచ్చే క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇస్తున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా.. అయితే మీరు మంద బుద్ది ఇలా తగలడుతుందని నేను ఊహించలేదు. అయితే ఇది మీ మీద ఎవరో ఒత్తిడి తెస్తే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారా? లేక మీరే స్వతాహాగా రాశారా అన్నది నా డౌట్. మహిళలల గౌరవానికి భంగం వాటిల్లితే నేను సహించను. జబర్దస్త్ షోని నిర్వహిస్తున్న మల్లెమాల, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయండి. ఇప్పటికే జబర్దస్ కామెడీ మీద చాలా నెగిటివ్ టాక్ ఉంది..

ఎవరైతే మహిళల కోసం పోరాడుతున్నారో వారికి గౌరవం ఇవ్వాల్సిన చోట అగౌరవ పరచడం తప్పు. పిచ్చి పంచ్‌లు వేసే ఆదికి.. వెర్రి నవ్వులు నవ్వే వాళ్లకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ జబర్దస్త్‌లో పంచ్‌లు వేశారు.కులం పేరుతో దూషించారని చితకొట్టారు మీ వాళ్లని. మీరు శృతి మించిన కామెడీ చేస్తే.. ఎవరో వచ్చి కొట్టేదాకా నేను వెయిట్ చేయను. నా చేతికి దురద ఎక్కువ.. అది అందరికీ తెలిసిందే. పిచ్చకొట్టుడు కొడతా.. హైపర్ ఆది గుర్తు పెట్టుకో అంటూ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.