హెయిర్ డ్యామేజ్,పొడి జుట్టు, చుండ్రుకి చెక్ పెట్టాలంటే…. మెంతులతో ఇలా ట్రై చేయండి  

ఈ రోజుల్లో 40 సంవత్సరాలు వచ్చేయంటే బట్ట తల రావటం కామన్ అయ్యిపోయింది. మారుతున్న కాలం, బిజీ జీవనశైలి,విపరీతమైన ఒత్తిడి వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మొదలు అవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టటానికి మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే మెంతులు సహాయపడతాయి. అది ఎలాగో చూద్దాం...

-

మెంతులలో నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది.మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టుకు మెరుపు రావటమే కాకుండా జుట్టు చిట్లటం తగ్గుతుంది.

మెంతులను నీటిలో ఉడికించి ఆ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానము చేయాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు రాలటం తగ్గుతుంది.