తుది దశలో “హెచ్ 4” వీసా రద్దు.. “70 వేల” భారత టెకీలకి షాకే       2018-05-25   05:25:54  IST  Bhanu C

హెచ్ -1బీ వీసా తో భారతీయలకి చెక్ పెడుతూ వస్తున్న అమెరికా ప్రభుత్వం మెల్ల మెల్లగా హెచ్ -4 స్పౌస్ వీసాపై కూడా ఆంక్షలు పెడుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే..అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హెచ్ 4 వీసాలను రద్దు ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ తుది దశలో ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది..అమెరికాలో ఉండే తమ పౌరులకి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో ట్రంప్ సర్కార్ హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు కల్పించే హెచ్ 4 వీసాల విషయంలో కూడ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది.

అయితే ఈ వీసాలను రద్దు చేసే నిర్ణయం చివరి దశలో ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా కోర్టుకు తెలిపింది

అంతేకాదు ఈ వీసాలని రద్దు చేయడం వలన అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీలపై ఆ ప్రభావం కన్పించనుంది. ఈ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ ఆసక్తిని చూపుతోంది. ఇదే విషయాన్ని అమెరికా సర్కార్ ఫెడరల్ కోర్టుకు గురువారం నాడు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలంలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్నవృత్తి నిపుణుల జీవిత భాగస్వామ్యులు హెచ్ 4 వీసాలతో అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇచ్చారు.

అయితే ఒబామా సర్కార్ గద్దె దిగిన వెంటనే ట్రంప్ తన పౌరులకి ఇచ్చిన మాట ప్రకారం భారతీయులని.. ఇంటికి పంపే పనిలో సర్కారు ఉంది…హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ చర్యల వలన సుమారు 70 వేల మంది ఇండియన్ టెక్కీలు ఇక ఇంటి బాట పట్టాల్సిందే…ఇదే జరిగితే ఈ ప్రభావం భారత సాఫ్ట్వేర్ పైన కూడా తీవ్రమైన ప్రభావం కూడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

,