హాట్ షో మిగిల్చిన చేదు పాపం లావణ్య త్రిపాఠి..       2017-09-11   00:56:13  IST  Raghu V

లావణ్యా త్రిపాఠి అందాలా రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యి తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. తరువాత ఆశించినంతగా విజయాలు రాకపోయినా హిట్స్ కోసం వేచి చూసింది. రెండేళ్లుగా మంచి మంచి అవకాశాలనే అందుకుంటూ దూసుకుపోతోంది. “సోగ్గాడే చిన్ని నాయన” లో నాగార్జున పక్కన నటించే అవకాశం కొట్టేసింది.ఆ సినిమా తో బ్లాక్ బ్లాస్టర్ కొట్టిన లావణ్య..శ్రీరస్తు శుభమస్తు తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.లావణ్య కి అవకాశాలు ఇప్పుడు వరుసగా వస్తున్నాయి.ఇంకొక హిట్ కనుకా తను సొంతం చేసుకుంటే స్టార్ హీరోయిన్ లిస్టు లోకి వెళ్ళడం ఖాయం.

కానీ ఈ ఏడాది సమ్మర్లో ‘రాధ’.. ‘మిస్టర్’ లాంటి డిజాస్టర్లు లావణ్యకు చేదు అనుభవాన్ని ఇస్తే ‘యుద్ధం శరణం’ ఆమె డిజాస్టర్ల హ్యాట్రిక్ ఇచ్చింది.ఈ సినిమాలో కాస్తంత గ్లామర్ కి ప్రేఫేరన్స్ ఇస్తూ గతంలో సినిమాలకంటే కూడా హాట్ హాట్ గా కనిపించింది.అంతేకాదు బయటకూడా హాట్ హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు లావణ్యా త్రిపాఠి అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అనేవారు..ఇప్పుడు ఆ అవకాశం ఎవ్వరికి ఇవ్వకూడదు అనుకుందేమో హాట్ హాట్ గా కనపడటానికి సిద్ధం అంటోంది ఈ అమ్మడు. అయితే ఎంత హాట్ గా కనపడినా ,ఎంత టాలెంట్ ఉన్నా వరుస అపజయాలు ఎదురవుతుంటే తెలుగు సినిమాలో ముందుగా బలై పోయేది హీరోయిన్ మాత్రమే. మరి లావణ్య కెరియర్ ఎలా ఉండబోతోంది చూడాలి