హస్తప్రయోగం ఎక్కువైతే జుట్టు రాలుతుందా? పూర్తి వివరణ

హస్తప్రయోగం వలన ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటూ ఏవేవో వింటుంటాం.హస్తప్రయోగం వలన అంగస్తంభన సమస్యలు వస్తాయని, హస్తప్రయోగం వలన మొటిమలు వస్తాయని, అలాగే హస్తప్రయోగం వలన రక్తం తగ్గుతుందని, ఇలా ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి.

 Excess Masturbation Causes Baldness In Men 1-TeluguStop.com

వీటిలో ఎలాగో లాజిక్ లేదు కాని, కొంచెం లాజిక్ ఉన్న టాపిక్ జుట్టు రాలడం.ఎందుకంటే జుట్టు పెరగటానికి, జుట్టు బలంగా ఉంటాదానికి అవసరం ప్రోటీన్.

ఈ ప్రోటీన్ విర్యంలో కూడా అవసరం.అంటే జుట్టుకి అందాల్సిన ప్రోటీన్ ని వీర్యం ద్వారా బయటకి తోస్తున్నాం, కాబాటి జుట్టుకి ప్రోటీన్ సరిపోక రాలిపోతుంది అని కొందరి వాదన.

 Excess Masturbation Causes Baldness In Men 1-హస్తప్రయోగం ఎక్కువైతే జుట్టు రాలుతుందా పూర్తి వివరణ-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి లాజిక్ ఉన్న ఈ టాపిక్ లో వాస్తవం కూడా ఉందా? హస్తప్రయోగం అతిగా చేసుకుంటే జుట్టు రాలిపోతుందా?

అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? ముఖ్యంగా మగవారిలో ఎందుకు రాలిపోతుంది? దీనికి ప్రత్యేకంగా ఒకే కారణాన్ని చెప్పలేం.కాని అతిముఖ్యమైన కారణం జీన్స్.

తండ్రి, తాతలకి బట్ట తల ఉంటే కొడుకు, మనవడికి బట్టతల వచ్చే అవకాశాలు దండిగా ఉంటాయి.దీన్నే మేల్ పాటర్న్ బాల్డ్ నెస్ అని అంటారు.

Dihydrotestosterone (DHT) పట్ల జీన్స్ సున్నితంగా ఉండటం వలన వస్తుంది.అంటే ఇందులో మగవారు కొత్తగా చేసే పొరపాటు ఏమి ఉండదు.

కేవలం జీన్స్ వలనే జుట్టు రాలిపోతూ ఉంటుంది.ఇక స్వీయ పొరపాట్ల వలన కూడా మగవారు జుట్టు పోగొట్టుకుంటారు.

అంటే కొన్ని వ్యాధుల వలన కావచ్చు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వలన కావచ్చు లేదంటే డ్రగ్స్ కి అలవాటు పడటం వలన కావచ్చు.మరి హస్తప్రయోగం వలన?

ప్రోటీన్ తక్కువ ఉంటే జుట్టు రాలడం సహజం.మరి వీర్యంలో ప్రోటీన్ ఉంటుందిగా, వీర్యం ఉత్పత్తి అవడానికి ప్రోటీన్ అవసరం కదా? అవసరమే, కాని వీర్యంలో ప్రోటీన్ శాతం కేవలం 10%.అంటే జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ కంటే వీర్యానికి అవసరమైన ప్రోటీన్ చాలా తక్కువ.ఒక మగవాడు రోజుకి 20 సార్లు హస్తప్రయోగం చేసుకునే అలవాటు చేసుకున్నా, హస్తప్రయోగం వలన ప్రోటీన్ డిఫీశియెన్సి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.కాబట్టి జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ వీర్యం ద్వారా బయటకి వెళుతోంది అనడం సబబు కాదు.

అలాగే టెస్టోస్టీరోన్ లెవల్స్ లో అవకతవకల వలన DHT సంబంధిత హెయిర్ లాస్ ఉంటుందని అనడంలో కూడా లాజిక్ ఉన్నా, నిజం లేదు.ఎందుకంటే హస్తప్రయోగం చేసుకున్న ఆ కొద్ది నిమిషాలే టెస్టోస్టీరోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.

స్కలనం జరగగానే టెస్టోస్టీరోన్ లెవల్స్ నార్మల్ స్తాయికి వెళ్ళిపోతాయి.కామోద్రేకం కూడా వెంటనే డౌన్ అయిపోతుంది.

కాబట్టి హస్తప్రయోగం వలన జుట్టు రాలడం అనేది అపోహే.

ఇక జుట్టు రాలడానికి స్ట్రెస్ కూడా ఓ కారణం అని చెప్పుకున్నాం కదా.హస్తప్రయోగం నిజానికి స్ట్రెస్ లెవల్స్ ని తగ్గిస్తుంది.కాబట్టి జుట్టు రాలుతుంటే హస్తప్రయోగం మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube