స్పైడర్ కి భయపడి పోయిన జై లవ కుశ టీమ్?       2017-09-14   03:17:40  IST  Raghu V

ఓవర్సీస్ అంటే మహేష్ బాబుకి సొంత మైదానం లాంటిది. క్రికెట్ లో ఎలాగైతే సొంత దేశంలో జట్లు రెచ్చిపోయి ఆడతాయో, మహేష్ అలాగే, ఓవర్సీస్ లో భీకరమైన బ్యాటింగ్ చేస్తాడు. బ్రహ్మోత్సవం రూపంలో మొదటిసారి తన సినిమాకు ఓవర్సీస్ లో నష్టాలు రావడంతో బాగా కసి మీద ఉన్నాడు సూపర్ స్టార్. స్పైడర్ బాహుబలి తరువాత అతిపెద్ద రిలీజ్ కాబోతోంది. ఎంత పెద్ద రిలీజ్ అంటే ఇప్పట్లో మరో సినిమా ఆ రేంజ్ ని అందుకోవాలంటే కష్టమే. స్పైడర్ ఏకంగా 600 లకు పైగా ఓవర్సీస్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ లెక్క 700 దాటే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సహజంగానే మహేష్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుతారు, ఈసారి రేటు ఇంకా ఘాటుగా ఉండొచ్చు అంట. ఇది ఇలా ఉంటే, మరివైపు జై లవ కుశ టీమ్ మరో పధ్ధతి పాటిస్తోంది.

జై లవ కుశ కి అమెరికాలో టికెట్ రెట్లు తక్కువ రేంజ్ లోనే ఉండబోతున్నాయి. పంపిణిదారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రీమియర్స్ కి $18, మామూలు షోలకి $16 వసూలు చేయనున్నారు. ఇలా తక్కువ రెట్లు పెట్టడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ గత సినిమా జనత గ్యారేజ్ ఇండియాలో అదరగొట్టి, ఓవర్సీస్ లో మోస్తారుగా ఆడటం వలన ఇలా చేస్తున్నారా లేక, స్పైడర్ పోటిలో ఉండటంతో ఇలా చేస్తున్నారా అర్థం కావడం లేదు.

రెండోవది నిజమైతే, జై లవ కుశ పరిస్థితే ఇలా ఉంటే, ఇక మహానుభావుడు చిత్రానికి ఓవర్సీస్ లో ఇంకెలాంటి కష్టాలు ఉంటాయో. మారుతి సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్నా, శర్వానంద్ మంచి ఫామ్ లో ఉన్నా, స్పైడర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటే తప్ప, మారుతి సినిమాకి కష్టాలు తప్పవు.