సౌదీలో ఏపీ యువకుడి మృతి..       2018-06-06   02:47:10  IST  Bhanu C

సౌదీ వెళ్లి ఎక్కువ డబ్బు సంపాదిస్తానని నిన్ను మంచిగా చూసుకుంటాను అమ్మా అని వెళ్ళిన ఓ తల్లి కొడుకు అనుకోకుండా మృతి చెందాడు..ఈ ఘటనతో ఒక్క సారిగా ఆ తల్లి కుప్పకూలి పోయింది..విదేశాలు వెళ్ళినప్పటి నుంచీ ప్రతీ పదిరోజులకి ఒక సారి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావ్ అంటూ అడిగే నాకొడుకు ఇక మీదట లేదు అంటూ ఏడుస్తున్న ఆ తల్లి ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు వివరాలలోకి వెళ్తే,

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కి చెందినా కె. 24 ఏళ్ల ఈసఫ్‌ యువకుడు యువకుడు డబ్బు సంపాదించాలని తన తల్లిని బాగా చూసుకోవాలని తల్లిని ఒప్పించి సౌదీ వెళ్ళాడు..తండ్రి లేని ఈసఫ్‌ తల్లిని బాగా చూసుకోవాలనే తపన ఎక్కువగా ఉండేది అయితే ఈ క్రమంలో సౌదీలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చు అని సౌదీ వెళ్ళాడు ఇందుకోసం తెలిసిన వాళ్ల దగ్గర సుమారు రూ.లక్ష అప్పు చేసినట్లు తెలిసింది. సౌదీ అరేబియాలోని ఆల్‌ఖరఫ్‌ పట్టణంలోని అనస్‌ అనే కపిల్‌ వద్ద తోట పనికి చేరినట్లు తల్లికి చెప్పాడు.అయితే

గడిచిన వారం క్రిత్రం గుండె మరియు శ్వాస సంభందిత వ్యాధులతో భాద పడుతున్న అతడిని అక్కడి ఆసుపత్రులలో చేరిచానా ఫలితం దక్కలేదని..అయితే వైద్యం అందిస్తున్నా అతడి శరీరం సహకరించడం లేదని తరువాత కొన్ని రోజులకి అతడు చనిపోయాడని తెలుస్తోంది..అయితే తన కొడుకు మృతదేహం అక్కడి నుంచీ తమ ఊరు తెప్పించడానికి ప్రభుత్వం సహాయపడాలని వేడుకుంటోంది..