సోదరిలా చూసుకుంటా....అంటూనే అత్యాచారం చేశాడు..       2018-05-31   20:13:01  IST  Raghu V

భర్తకి దూరంగా ఉంటున్న ఒక యువతిపై మాయమాటలు చెప్పి నమ్మించిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు..పైగా యువతికి అన్న లా చూసుకుంటానని చెప్పి చివరికి ఆమెని మానభంగం చేయడంతో ఆ యువతి తీవ్రమైన మానసిక వేదనకి లోనవుతోంది..భర్తతో గొడవ పడి దూరంగా ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి కంప్యూటర్ నేర్పుతాను చెప్పి సోదరుడిలా తోడుగా ఉంటానని చెప్పిన ఆ యువకుడు అమెపైనే కన్నేశాడు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం

మహారాష్ట్రకు చెందిన రోహిత్‌ ఠాగూర్‌ కంప్యూటర్‌ కోర్సు నేర్చుకునే రోజుల్లో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. యువతికి అప్పటికే వివాహమైంది. అనంతరం భర్తతో వివాదాల కారణంగా దూరంగా ఉంటోంది..అయితే ఇదే అదనుగా గ్రహించిన భావించిన యువకుడు కంప్యూటర్‌ కోర్సు నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి నగరానికి తీసుకొచ్చాడు. నగరంలో గది అద్దెకు తీసుకొని ఇద్దరు నివసిస్తున్నారు.అయితే యువతికి మూర్ఛ వ్యాధి ఉండడంతో ఒక రోజు రాత్రి యువతిపై అత్యాచారం చేశాడు. నమ్మించి మోసం చేశాడని ఆ యువతి నిద్ర మాత్రలు మింగి తానూ కూడా అతయచారై ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు, పోలీసులు సకాలంలో ఆస్పత్రిలో చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు.