సొంత తల్లి దండ్రులను పట్టించుకోని సీనియర్ నటుడు  

Senior Actor Nassar Neglected His Parents-

విలక్షణ నటుడు,సీనియర్ ఆర్టిస్ట్ నాజర్ పై అతని సోదరులు పలు ఆరోపణలు చేస్తున్నారు.వైవిధ్యమైన పాత్రల తో దాదాపు అన్నీ భాషల్లో నటించి అందరిని మెప్పించిన నాజర్ సొంత తల్లి దండ్రులను మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆయన సోదరులు అయినా జవహర్,ఆయూబ్ లు ఆరోపణలు చేస్తున్నారు.దక్షణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడి గా ఉన్న ఆయన వృద్ధాప్యంలో ఉన్న తల్లి దండ్రుల కనీస భాద్యతలను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు..

Senior Actor Nassar Neglected His Parents--Senior Actor Nassar Neglected His Parents-

నాజర్ ఫ్యామిలీ లో పెద్ద వాడు.ఆయన తరువాత ముగ్గరు సోదరులు కూడా ఉన్నారు.అయితే చివరి సోదరుడు మానసిక వ్యాధిగ్రస్తుడు కావడం తో అతడి బాగోగులు కూడా తల్లి దండ్రులే చూసుకోవాల్సి వస్తుంది.

అయితే పెళ్లి అయిన తరువాత తమ సోదరుడు నాజర్ వేరుగా వెళ్లిపోయారని, కనీసం కన్న తల్లి దండ్రుల గురించి పట్టించుకోవడం లేదంటూ మిగిలిన ఇద్దరు సోదరులు ఆరోపిస్తున్నారు.ఆర్ధికంగా సెటిల్ అయిన నాజర్ తల్లి దండ్రులను పట్టించుకోకపోవడం తో ఆయన సోదరులమైన మేము వారి భాద్యత తీసుకున్నామని, అయితే మేమిద్దరమే కుటుంబ భారాన్ని మోయడం చాలా కష్టం అయిపోతుంది అని అందుకే ఇప్పటికైన కుటుంబానికి అండగా ఉండాలని వారు కోరారు.ఒకవేళ ఇప్పుడు కూడా భాద్యత తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్దమే అంటూ వారు హెచ్చరిస్తున్నారు.

మరి సినిమా లలో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన నాజర్ కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదో, మరి ఈ ఆరోపణల పై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.