సూర్య ప్రమాదం నుండి బయట పడ్డ మహేష్‌       2018-05-20   23:52:52  IST  Raghu V

కొన్ని సార్లు హీరోలు తమ వద్దకు వచ్చిన కథను వద్దంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ కథు వేరే హీరోల వద్దకు వెళ్లగా సూపర్‌ హిట్స్‌ అవుతూ ఉంటాయి. మరి కొన్ని సందర్బాల్లో మాత్రం హీరో వద్దనుకున్న సినిమాలు సూపర్‌ సక్సెస్‌ అయిన దాఖలాలు ఉన్నాయి. పవన్‌ తిరష్కరించిన రెండు మూడు సినిమాలు ఇతర హీరోు చేయడంతో సూపర్‌ హిట్‌ అయిన విషయం మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూనే ఉంటాం. తాజాగా అల్లు అర్జున్‌ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని మొదట మహేష్‌బాబుతో చేయాలని దర్శకుడు వంశీ వక్కంతం భావించాడట. కాని మహేష్‌ ఆ కథ నచ్చక పోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పాడు.

ఎన్టీఆర్‌ హీరోగా కళ్యాణ్‌ రామ్‌ బ్యానర్‌లో వంశీ వక్కంతం దర్శకత్వంలో ఒక సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఎలాగైనా దర్శకత్వం చేయాలనే పట్టుదలతో రచయిత అయిన వక్కంతం వంశీ పలు కథలు సిద్దం చేసుకుని ఫైనల్‌గా అశ్వినీదత్‌ ద్వారా మహేష్‌బాబును కలవడం జరిగింది. మహేష్‌బాబుకు కథ చెప్పేందుకు అశ్వినీదత్‌ 20 లక్షల అడ్వాన్స్‌ను కూడా వంశీ వక్కంతంకు అందించాడు. నా పేరు సూర్య కథ రెండు మూడు వర్షన్‌లలో మహేష్‌బాబుకు దర్శకుడు వినిపించాడట. కాని మహేష్‌బాబు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఈ కథ తనకు వర్కౌట్‌ కాదు అంటూ తేల్చి చెప్పడంతో అశ్వినీదత్‌ ఆయన వద్ద నుండి అడ్వాన్స్‌ను తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ సమయంలోనే నల్లమల్లపు బుజ్జి ద్వారా అల్లు అర్జున్‌ను అదే కథతో వక్కంతం వంశీ అప్రోచ్‌ అయ్యాడు. ఆర్మీ నేపథ్యం అనగానే అల్లు అర్జున్‌ టెంమ్ట్‌ అయ్యాడు. ఆర్మీపై ఉన్న అభిమానంతో ఈ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నల్లమల్లపు బుజ్జి నిర్మాణంలో కాకుండా ఈ సినిమాను తన మామ నాగబాబుకు ఇవ్వాలని భావించాడు. అలా నాగబాబు, లగడపాటి శ్రీధర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్‌బాబు వద్దన్నాడనే విషయం తెలిసి కూడా అల్లు అర్జున్‌ ఈ సినిమాను కమిట్‌ అయినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
‘బ్రహ్మోత్సవం’, ‘సైడర్‌’ వంటి డిజాస్టర్స్‌ తర్వాత ఒక వేళ నా పేరు సూర్య చేస్తే అదే తరహా అట్టర్‌ ఫ్లాప్‌ మహేష్‌కు పడేది. ఆ ప్రమాదం నుండి మహేష్‌ తప్పించుకున్నాడు అంటూ ప్రస్తుతం సినీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు. నా పేరు సూర్యకు బదులుగా మహేష్‌బాబు భరత్‌ అనే నేను చిత్రం చేశాడు. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదాల నుండి బయట పడుతూ ఉంటారు. నా పేరు సూర్య ప్రమాదం నుండి బయట పడ్డ మహేష్‌ బ్రహ్మోత్సవం, స్పైడర్‌ వంటి డిజాస్టర్‌ ప్రమాదాల నుండి బయట పడలేక పోయాడు.