సునీల్ జేబులోంచి పెట్టిన డబ్బంతా బూడిదలో       2017-09-16   01:34:23  IST  Raghu V

ఒకప్పుడు సునీల్ అంటే మోస్ట్ సేలేబుల్ కామెడియన్. బ్రహ్మానందం సూపర్ ఫామ్ లో ఉన్న రోజుల్లోనే కమెడియన్ చలామణీ అయ్యాడు. నిత్యం బిజీగా ఉండే కాల్షీట్ల తో స్టార్ గా ఎదిగాడు. ఒకప్పుడు సునీల్ అంటే ఎంత క్రేజ్ ఉండేది అంటే అందాలరాముడు సినిమా కి వచ్చిన కొందరు స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఆ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడంతో సునీల్ తదుపరి సినిమాలకు కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అంతే, హీరోగా ఇరుక్కుపోయాడు సునీల్. డ్యాన్సులు చేయడం, సిక్స్ ప్యాక్ చేయడం, ఇలా పూర్తిగా హీరో వాసన కొట్టేసింది. క్రమంగా సునీల్ జనాలకు దూరం అవుతూపోయాడు.

ఇప్పుడు సునీల్ సినిమాలకు సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. సినిమాలకు సరైన విడుదలకు నోచుకోవడం లేదు. ఎప్పుడో పూర్తయిన ఉంగరాల రాంబాబు ఇన్నాళ్ళు విడుదల అయ్యేందుకు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు‌. అటుచేసి ఇటుచేసి విడుదలకి పూనుకున్నాడు నిర్మాత. కాని సినిమాకి అస్సలు బజ్ లేదు‌. ఇంతకుముందు సునీల్ సినిమాల ఫలితాలు పక్కనపెడితే ఓ మోస్తారు ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. ఉంగరాల రాంబాబుకి ఆ పరిస్థితి కూడా కనిపించకపోవడంతో సునీల్ తన సొంత డబ్బుతో ఈ సినినా ప్రమోషన్స్ ని నడిపించాడట.

ఎందుకంటే ఓపెనింగ్స్ రాకపోతే అది తన మార్కెట్ ని ఇంకా కిందికి దిగజారుస్తుంది. కాని సునీల్ అంతలా కష్టపడి, లక్షలు ఖర్చుపెట్టినా లాభం లేకుండాపోయింది‌. ఉంగరాల రాంబాబు ఓపెనింగ్స్ ఏమి బాలేవు. టాక్ కూడా బాగా లేకపోవడంతో ఈ సినిమా కోలుకునేది కష్టమే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.