సుడిగాలి సుధీర్ , రష్మిల మధ్య ప్రేమ నిజమేనా? ఢీ షో లో రష్మీ తో ప్రేమ గురించి ఏం చెప్పడంటే...  

  • ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సుడిగాలి సుధీర్, ఆ షో యాంకర్ రష్మి ఇద్దరు ఎవరికి వారు సొంత టాలెంట్ తో వచ్చినవారే ఇక మల్లెమాల ప్రొడక్షన్ వల్ల జబర్దస్త్ క్లిక్ అవడం అందులో ఉన్న ప్రతి ఒక్క టీం లీడర్ కి , అందులోని టీం మెంబెర్స్ కి ఈటీవీ ప్లస్ లో ఒక్కో షో చేయండి అని అప్పగించారు.

  • -

  • అయితే సుధీర్ , రష్మీ ల సన్నిహిత్యం చూసి వారిని ఈటీవీ లో ప్రసారామయ్యే ఢీ షో లో వీళ్ళకి టీం లీడర్స్ బాధ్యత ఇచ్చారు, యాంకర్ గా ప్రదీప్ వ్యవహరిస్తుంటే జడ్జిస్ గా శేఖర్ మాస్టర్ , ప్రియమణి జడ్జెస్ గా ఉన్నారు. రష్మీ అంటే సుధీర్ కి ఇష్టమని చాలా పుకార్లు ఉన్నాయి , కానీ ఇవి పుకార్లు కాదు నిజమే అనడానికి ఢీ షో లో వారి మధ్య కెమిస్ట్రీ చూస్తేనే అర్థమవుతుంది.చాలా సార్లు సుధీర్ ని దీని పై స్పందించమంటే మా మధ్య అలాంటిది ఏమి లేదు షో కోసమే అలా చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు

  • -
  • కానీ వీరిని ఆన్ స్క్రీన్ లో చూస్తే ఎవరైనా నిజమైన ప్రేమికులే అనుకుంటారు. ఇటీవల జరిగిన ఢీ షో లో యాంకర్ ప్రదీప్ సుధీర్ ని ఇరకాటం లోకి నెట్టేసాడు.అందరి ముందు మీ ప్రేమ గురించి సుధీర్ ని చెప్పమన్నాడు. తను మొదటి సారి 2013 లో ఆమెని జబర్దస్త్ లో చూసాను అప్పుడే పడిపోయాను , ఆ క్షణం లో తనని చూసిన సన్నివేశం ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తుంది అలాగే ఒకసారి జబర్దస్త్ కంటెండెర్స్ అందరికి రష్మీని ప్రపోజ్ చేసే టాస్క్ వచ్చిందని అప్పుడే మంచి సమయం అని నా మనస్సులోని మాటలన్నీ తనకి చెప్పేసా అన్నాడు.
    అలాగే వారికి ఇష్టమైన పాట నిన్నే పెళ్లాడుతా లోని కన్నుల్లో నీ రూపమే పాటని అందరి ముందు కలిసి పాడారు. అప్పట్లో ఉగాది సందర్బంగా ప్రసారం అయిన ఆహా నా పెళ్ళంట షో కోసం వీరు చేసిన పెళ్లి వీడియో వైరల్ అయింది వీరి మధ్య నిజంగా ప్రేమ ఉందో తెలియదు కాని వీరి జంట చూసిన ప్రతి ఒక్కరు ఇది నిజమైతే బాగుండు అనుకుంటున్నారు