“సీఏఎన్‌జెడ్” చైర్మెన్ గా భారత “ఎన్నారై”       2018-05-20   22:28:29  IST  Bhanu C

భారత సంతతి వ్యక్తులు విదేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఎక్కువగా ఉంటారు..దేశ విదేశాలలో ఉన్న భారత ఎన్నారై లు అందరిని పోల్చుకుంటే అమెరికాలు ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది..అయితే అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎన్నో రంగాలలో చివరికి రాజకీయ రంగంలో సైతం భారత ఎన్నారై లు చక్రం తిప్పుతున్నారు..భారతీయ సత్తా చాటి చెప్తున్నారు..

అయితే ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్‌లో భారత ఎన్నారై అందులోనూ తెలుగు ఎన్నారై మన సత్తా చాటాడు..తన అత్యుత్తమ ప్రతిభకి న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎంతో పెద్ద భాద్యతని అప్పగించింది.. న్యూజిలాండ్‌లో అతిపెద్ద జైలు అయిన “మౌంట్ ఈడెన్ ప్రిజెన్” ఎంప్లాయి యూనియన్(సీఏఎన్‌జెడ్) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి సీతారాం సల్వాజీ ఎన్నికయ్యారు. సీతారాం వరుసగా రెండో ఏడాది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

ఇదిలాఉంటే న్యూజిలాండ్‌లో ఉన్న మొత్తం 18 జైళ్లలో “మౌంట్ ఈడెన్ ప్రిజెన్” అత్యంత పెద్దది ఈ జైళ్లో దేశవిదేశాలకు చెందినవారు పని చేస్తుంటారని, ఓ తెలుగు వ్యక్తి వరుసగా రెండో ఏడాది యూనియన్‌ చైర్మన్‌గా ఎన్నికవడం ఆనందంగా ఉందని అక్కడి తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…అంతేకాదు సీతారాం న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్‌కు 2006, 2007లో అధ్యక్షుడిగా కూడా ఉన్నారు..అక్కడ ఉన్న తెలుగువారు అందరూ సీతారం ఎంపికపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.