సినిమా ఛాన్స్ కోసం వెళ్తే నన్ను రేప్ చేసాడు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చూడండి       2018-05-21   23:17:29  IST  Raghu V

సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా వెలిగిపోదామనే ఆశతో ఇండస్ట్రీకి అమ్మాయిలను సినిమా అవకాశం ఇస్తామని ఆశ చూపించో… భయపెట్టో వాళ్లను పడక సుఖానికి వాడుకోవడం అన్నది ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. ఇలాంటి సంఘటనలు తెలుగు సినిమాకో..మన దేశం లో పెద్ద ఇండస్ట్రీ అయిన బాలీవడ్ వరకో పరిమితం కాలేదు. పెద్ద పెద్ద సినిమాలు తీసే హాలీవుడ్ ఇందుకు మినహాయింపు ఏమీ కాదని అంటోంది ఫేమస్ ఇటాలియన్ యాక్టర్ , డైరెక్టర్ ఆసియా అర్జెంటో.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ప్రజంట్ చేయడానికి వచ్చిన 42 ఏళ్ల అర్జెంటో తన బావోద్వేగాలని చెప్పుకుంది. హాలీవుడ్ లోని బిగ్ ప్రొడ్యూసర్ హార్వే వెయిన్ స్టెయిన్ 21 ఏళ్ల వయసులో తనను బలవంతంగా అనుభవించాడని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ‘‘వెయిన్ స్టెయిన్ చేతిలో బలయిపోయిన ఆడవాళ్లలో నేనేం మొదటిదాన్ని కాదు. ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అతడు వేటాడే చోటు. 1997 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినప్పుడు నన్ను ఎంత రాక్షసంగా అనుభవించాడో మాటల్లో చెప్పలేను. అప్పటికి నాకు 21 ఏళ్లు. ప్రపంచమంటే సరిగ్గా తెలియదు. నా బాధ ఎలా చెప్పుకోవాలో తెలియలేదు. ఆ విషయం గురించి ఇప్పుడు చెప్పాలన్నా నాకు వణుకు వచ్చేస్తోంది’’ అంటూ అర్జెంటో తన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

తనలా ఎంతోమంది ఇదే క్షోభ ఎదుర్కొన్నప్పటికీ వారు బయటపడటం లేదని.. తాను ధైర్యంగా చెబుతున్నానని అర్జెంటో చెప్పుకొచ్చింది. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారని.. వాళ్లెవరికీ ఇండస్ట్రీలో కొనసాగే అర్హతే లేదని అర్జెంటో మండిపడిపోయింది. వెయిన్ స్టెయిన్ కు మరెప్పటికీ కేన్స్ లో అడుగుపెట్టనీయకూడదని కోరింది. మొత్తానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఇలా ఓ సంచలన వ్యాఖ్యలతో ముగిసింది.