సబ్ స్టేషన్ లో పేలుడు

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల కేంద్రంలోని 132/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో సివిటి పేలడంతో భారీ శబ్దం వచ్చింది.దీనితో మంటలు చెలరేగి,దట్టంగా పొగలు అలుముకున్నాయి.

 Explosion In Substation-TeluguStop.com

పేలుడు ధాటికి సామాగ్రి పిటిఆర్ 2 కు తగలడంతో ప్రస్తుతం అందులో ఉన్న ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది.అధిక ఓల్టేజి పడడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సబ్ స్టేషన్ ఆపరేటర్ సతీష్ పేర్కొన్నారు.

జరిగిన సంఘటనను జిల్లా ఉన్నత కరెంట్ అధికారులకు తెలియపరచారు.సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు,ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.సబ్ స్టేషమ్ లో పేలుడు సంభవించడంతో మండలంలోని వివిధ గ్రామాలకు కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube