శ్వేతార్క గణపతిని బుధవారం తెల్ల జిల్లేడుతో పూజిస్తే?

సాధారణంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలు శిలలు చేత శిల్పాలుగా చెక్కబడి వాటిని ప్రతిష్ఠించి పూజిస్తారు.

 What If Swetarka Ganapati Is Worshiped With A White District-TeluguStop.com

కానీ శ్వేతార్క గణపతిని ఎవరు సృష్టించరు.కొన్ని స్వయంగా ఏర్పడతాయి.

వాటిలో ఈ శ్వేతార్క గణపతి ఒకటి శ్వేతం అనగా తెలుపు,అర్కము అనగా తెల్లజిల్లేడు, మూలము అనగా వేరు.అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు మూలాల నుంచి స్వయంగా ఏర్పడిన గణపతిని శ్వేతార్క గణపతి అని అంటారు.

 What If Swetarka Ganapati Is Worshiped With A White District-శ్వేతార్క గణపతిని బుధవారం తెల్ల జిల్లేడుతో పూజిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెల్ల జిల్లేడు వేరు మొదలు పై గణపతి నివసిస్తాడు.ఈ వేళ్ళు కొన్నిసార్లు గణపతి ఆకృతిని పోలి ఉండటం వల్ల తెల్ల జిల్లేడు చెట్టు పరమ పవిత్రంగా భావించి పూజిస్తారు.

శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజించడం ద్వారా వారికి జ్ఞానసంపద, సుఖసంతోషాలు లభిస్తాయి.ఈ శ్వేతార్క మొక్క గనుక మన ఇంట్లో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి.

ఎవరైనా మనకు హాని తలపెట్టిన అలాంటివి దుష్ప్రభావం చూపకుండా తలపెట్టిన వారిపై ఆ ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి.

సాధారణంగా కొంత మంది తెల్ల జిల్లేడుచెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదని చెబుతూ ఉంటారు.

అది కేవలం అపోహ మాత్రమే.తెల్ల జిల్లేడు చెట్టు మన ఇంటిలో ఉంటే ఇక ఆ ఇంటికి దరిద్రం అంటే ఏమిటో అసలు తెలియదు.

ఎల్లప్పుడు ఆ ఇంటికి ధన ప్రవాహం కలిగి సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతారు.ఈ శ్వేతార్క గణపతిని పూజించిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

చదువు,ఉద్యోగం,పెళ్లి పిల్లలు,ఆరోగ్యం వంటి అనేక సమస్యలతో గుడికి వచ్చే వారు ఈ శ్వేతార్క గణపతిని పూజించడం ద్వారా వాటి నుంచి విముక్తి పొందుతారు.

జాతక చక్రంలో సూర్య గ్రహ దోషాలున్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు, నరదృష్టి ఉన్నవారు, సర్వ కార్య సిద్ధి కొరకు ఈ శ్వేతార్క గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజించటం ద్వారా ఎటువంటి దోషాల నుంచి అయినా విముక్తి పొందుతారు.

సాధారణంగా తెల్ల జిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

#Wednesday Pooja #Hindu Believes #Hindu Rituals #TellaJilldu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU