శ్రావణ మాసం,అమావాస్య సోమవారం, సూర్య గ్రహణం ఈ నాలుగు ఒకే రోజు….ఇలా చేస్తే అదృష్టం కలుగుతుంది  

శ్రావణ మాసం,అమావాస్య సోమవారం, సూర్య గ్రహణం ఈ నాలుగు ఒకే రోజు రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు శివుణ్ణి పూజించటం మరియు శివునికి అభిషేకాలు చేయటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు,తప్పులు అన్ని హరించుకుపోతాయి. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు..

-

ఈ రోజు కోసం సప్త ఋషులు,నవగ్రహాలు,ముక్కోటి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారుశ్రావణ మాసంలో వచ్చే ఈ సోమవతి అమావాస్యను మహా శివరాత్రి కన్నా మంచి రోజని పండితులు చెప్పుతున్నారు. అందువలన ఆ రోజు శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉంటె పుణ్యం వస్తుందని పండితులు చెప్పుతున్నారు. ఈ రోజున అభిషేకం చేస్తారు ఎందుకంటే ఈ రోజు సకల శక్తులు లింగ రూపుడైన శివుడులో కొలువై ఉంటాయి .

అందువల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పుతారు

దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ఆ కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక సాధువు ఒక వ్యాపారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక రోజు సాధువు ఆ వ్యాపారి ఇంటిలో పెళ్లి కానీ కన్యను చూసి దీవించకుండా వెళిపోవటంతో ఆ కుటుంబం చాలా బాధపడుతుంది.

ఆ కుటుంబం బాగా అలోచించి ఆ కన్య జాతకాన్ని పురోహితునికి చూపిస్తే ఆమెకు వివాహం అయితే భర్త తొందరగా చనిపోతాడని చెప్పుతాడు. అప్పుడు దీనికి పరిష్కారం ఏమిటని అడగగా సింఘాల్ ప్రాంతంలోని ఒక చాకలి స్త్రీకుంకుమ అడిగి ధరిస్తే దోషం పోతుందని చెప్పుతారు. అప్పుడు ఆ వ్యాపారి ఆ కన్యను, చిన్న కొడుకుతో సింఘాల్ ప్రాంతానికి పంపుతాడు.

దారి మధ్యలో నది దాటుతూ ఉండగా అప్పుడే పుట్టిన గద్ద పిల్లను చంపి తినటానికి పాము రావటం కనపడుతుంది. ఆ కన్య పామును చంపి గద్ద పిల్లను కాపాడుతుంది. అప్పుడు ఆ గద్ద పిల్ల చాకలి స్త్రీ ఇంటికి దారి చెప్పుతుంది.

ఆ కన్య ఆ చాకలి స్త్రీకి కొన్ని రోజుల పాటు సేవ చేస్తే సోమవతి అమావాస్య నాడు కుంకుమ ఇవ్వటంతో ఆ కన్య దోషం పోయింది.