వైరల్: వయసు 13 ఏళ్లే.. కానీ స్ట్రీట్‌ఫుడ్‌ ఎంత ఫాస్టుగా తయారుచేస్తున్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు!

13 Years Haryana Boy Dipesh Street Food Fast Cooking Skills

సోషల్ మీడియాలో స్ట్రీట్‌ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.నోరూరించే స్ట్రీట్‌ఫుడ్‌ను తయారు చేసే వంట మనుషులకు అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి.

 13 Years Haryana Boy Dipesh Street Food Fast Cooking Skills-TeluguStop.com

కస్టమర్లకు క్షణాల్లోనే వేడివేడి ఫుడ్ అందించేందుకు వారు యమ ఫాస్ట్ గా పని చేస్తుంటారు.అంతేకాదు వారి కుకింగ్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.

వారిలాగా మనం రుచికరమైన వంట చేయాలి అంటే చాలా సాధన అవసరమవుతుంది.అలాగే సహనం కూడా అవసరమే.

 13 Years Haryana Boy Dipesh Street Food Fast Cooking Skills-వైరల్: వయసు 13 ఏళ్లే.. కానీ స్ట్రీట్‌ఫుడ్‌ ఎంత ఫాస్టుగా తయారుచేస్తున్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఒక 13 ఏళ్ల కుర్రాడు మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో కుకింగ్ స్కిల్స్ అలవర్చుకున్నాడు.అంతేకాదు రోడ్డుపై నోరూరించే ఫుడ్ తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

విశేషమేంటంటే.అతడు తయారుచేసే ఫుడ్ చాలా ఫేమస్.

అందుకే అతడికి మాస్టర్ చెఫ్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు.ఈ బాలుడు చిల్లీ పొటాటో, స్ప్రింగ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ చకచకా చేసేస్తూ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.హర్యానా రాష్ట్రంలోని ఫారిదాబాద్ సిటీలో దిపేష్ అనే 13 ఏళ్ల కుర్రాడు స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయిస్తున్నాడు.అతనొక్కడే ఫుడ్ తయారు చేస్తూ తోటి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఈ నేపథ్యంలో విశాల్ అనే ఒక యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ దిపేష్ గురించి ఒక వీడియో చేశాడు.

చిన్నతనంలోనే అత్యద్భుతంగా చిల్లీ పొటాటో, స్ప్రింగ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తున్నావు అంటూ విశాల్ దిపేష్ ని అడిగాడు.మీ ఇల్లు ఎక్కడ? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? స్కూల్ కు వెళ్తున్నావా? లాంటి బేసిక్ ప్రశ్నలు సంధించాడు.

అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేశాడు దిపేష్.ఆ సమయంలో కూడా చాలా వేగంగా వంట చేస్తూ తన డెడికేషన్ ఏంటో చాటుకున్నాడు.

ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తానని.సాయంత్రం పూట మాత్రమే స్ట్రీట్‌ఫుడ్‌ బండి ని ఓపెన్ చేస్తానని దిపేష్ చెప్పుకొచ్చాడు.రాత్రి తొమ్మిదింటి వరకు వంట చేస్తూనే ఉంటానని వెల్లడించాడు.తన తల్లిదండ్రులకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే తన వంతుగా కొంత ఆదాయం సంపాదిస్తున్నానని చెప్పాడు.చిరుప్రాయంలోనే ఇంత పెద్ద ఆలోచన చేసిన దిపేష్ ని అందరూ తెగ పొగిడేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 8 లక్షలకు పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

బాలుడి హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ అంటూ చాలా మంది ఫిదా అయిపోతున్నారు.పెద్దయ్యాక ఇతడొక గొప్ప చెఫ్ అవుతాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

#Haryana Boy #Vishal #Dipesh #Street #French

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube