వైట్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ పాక్స్ మీ కోసమే     2018-05-01   22:48:34  IST  Lakshmi P

చర్మ గ్రంధులలో మృత కణాలు,నూనె ఎక్కువగా ఉన్నప్పుడు సన్నని,తెల్లని గుండ్రని పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్య అన్ని చర్మ తత్వాల వారికి వస్తుంది. ఈ సమస్య పరిష్కరానికి ఖరీదైన కాస్మొటిక్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ఈ కాంబినేషన్ మీ చర్మంపై చేరిన మురికిని బయటకిలాగి, వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.