వేసవిలో శరీరంలో వేడిని తగ్గించే సులభమైన చిట్కాలు       2018-05-12   22:00:07  IST  Lakshmi P

వేసవికాలం వచ్చిందంటే ఎండ వేడికి వడదెబ్బ తగలటం ఖాయం. ఇక పసిపిల్లలు,ముసలివారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎండ వేడికి శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే ఉప్పు శాతం కూడా తగ్గిపోతుంది. దాంతో శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి శరీరం వేడెక్కుతుంది. ఈ వేసవికాలంలో వడదెబ్బ మరియు శరీరంలో వేడిని తగ్గించుకోవటానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

శరీరంలో వేడి తగ్గాలంటే రోజులో ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండాలి. మాములు రోజుల్లో త్రాగే నీటి కన్నా వేసవిలో ఎక్కువగా త్రాగాలి.

సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండ్లలో విటమిన్ సి మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

వేసవికాలంలో శరీరంలో వేడిని తగ్గించటానికి పెరుగు అన్నం మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. వేసవికాలంలో పెరుగు అన్నం ఎక్కువగా తినాలి. కొంత మంది పెరుగు అన్నమును చాలా తక్కువగా తింటారు. వారు పెరుగు అన్నమును ఎక్కువగా తినటం అలవాటు చేసుకోవాలి.

మజ్జిగను ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించి వేసవి తాపాన్ని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాస్ చల్లని పాలలో ఒక స్పూన్ బాదం పొడి లేదా రెండు చుక్కల బాదం ఆయిల్ వేసి బాగా కలిపి త్రాగాలి.

,