వీర్య ఉత్పత్తి తగ్గకుండా చేసే స్పెషల్ అండర్ వియర్ ఆవిష్కరణ – ధర చాలా చవక       2017-09-19   04:24:30  IST  Lakshmi P

ఆర్థర్ మేనార్డ్ అనే బ్రిటిష్ బిజినెస్ మెన్ ఓరోజు రాత్రి భోజనం తరువాత డ్రింక్ తాగుతో తన స్నేహితులతో రకరకాల విషయాలపై మాట్లాడుతున్నాడు. అంత పెద్ద బిజినెస్ మెన్ దేని గురించి మాట్లాడుతాడు, ఆర్ధిక వ్యవస్థ గురించి, షేర్స్, డిబెంచర్స్ గురించి మాట్లాడుతున్నాడెమో అని అనుకుంటున్నారేమో, ఆరోజు అతను వృషణాల గురించి మాట్లాడుతున్నాడు. అవును, పురుషుల వృషణాల మీదే చర్చ జరుగుతోంది.

కాని మీరు ఊహించినట్టుగా ఎదో బూతు ముచ్చట జరగట్లేదు. టెక్నాలజీ మనిషిని ఎంతలా బలహీనపరుస్తోంది, స్మార్ట్ ఫోన్, వైఫై వలన తన వృషణాలకి, వీర్య ఉత్పత్తికి ప్రమాదం ఉందని తెలిసినా, స్మార్ట్ ఫోన్ ని ఇంటర్నెట్ ని పక్కనపెట్టలేకపోతున్నాడు అని చర్చ మొదలుపెట్టాడు ఆర్థర్. ఈ కాలంలో ఇంటర్నెట్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకడం చాలా కష్టం. కాబట్టి వాటి నుంచి వృషణాలను రక్షించే మార్గం కనుక్కోవాలి అని అఆలోచిస్తున్న ఆర్థర్ కి ఒక వెరైటి ఆలోచన తట్టింది. వృషణాలని రేడియేషన్ తరంగాల నుంచి రక్షించే ఎలక్ట్రానిక్ పరికరం కొత్తగా తోడుక్కోవడం జరగని పని, మరి ఆ తరంగాలను ఆపగలిగే అండర్ వియర్ తయారు చేస్తే ఎలా అని ఓ ఆలోచన వెలిగింది అతని మెదడులో. బ్రిలియంట్ ఐడియా అంటూ చప్పట్లు కొట్టారు స్నేహితులు. ఆలోచన రావడమే ఆలస్యం, ఆ సరికొత్త అండర్ వియర్ రూపకల్పనలో బిజీ అయిపోయాడు.

ఆ స్పెషల్ అండర్ వియర్ పేరు స్పార్టన్. ఇవి బాక్సర్ షార్ట్ స్టయిల్ లో డిజైన్ చేయబడిన అండర్ వియర్స్. 1836 లో ఒక ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ రూపొందించిన Faraday cage ఐడియా మీద ఈ అండర్ వియర్స్ ని డిజైన్ చేసారు. వీటి రూపకల్పనలో సిల్వర్ వాడటం విశేషం. అయితే సిల్వర్ వాడినంత మాత్రానా ఇవి గట్టిగా, బలంగా, అండర్ వియర్ కి క్రికెట్ బాల్ వచ్చి తగిలినా ఆపగలిగేలా గట్టిగా ఉంటాయి అనుకుంటే పొరపాటే, కేవలం సిల్వర్ పూతలు వాడారు. ఇవి మామూలు అండర్ వియర్ లాగే ఉంటాయి కాని రేడియేషన్ తరంగాలను 99% ఆపగలవు. వీటికి స్పార్టన్ (యోధుడు) అనే పేరు కావాలనే పెట్టారు. ఎందుకంటే ఇవి హానికరమైన తరంగాల నుంచి పురుషాంగం, వృషణాలు, వీర్యాన్ని కాపాడతాయి కాబట్టి.

30 దేశాల్లో ఈ స్పెషల్ అండర్ వియర్స్ ని అమ్ముతున్నారు. మగవారు వీటిని ఎగబడి మరి కొంటున్నారు. అప్పుడే ఈ కొత్త ప్రాడక్ట్ వ్యాపారం కోట్లను చేరింది. కావాలంటే మీరు కూడా https://spartanunderwear.com/en/home/ ఈ లింక్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే, ఒక పెయిర్, అంటే రెండు అండర్ వియర్స్ కలిపి మన కరెన్సీలో రూ.2155 నుంచి రూ.2700 మధ్య ఉంటుంది.