వీరి దోస్తానా అ‘పూర్వం’..స్నేహితుడి కోసం ఏం చేశారంటే?

ఇటీవల అందరూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా విషెస్ చెప్పుకున్న సంగతి మనందరికీ తెలుసు.మనం కూడా సోషల్ మీడియాలో హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ గ్రీటింగ్స్ పెట్టే ఉంటాం.

 Friendship Viral News District Khanapuram Joint Warangal-TeluguStop.com

అయితే, స్నేహం గురించి నిజమైన అర్థం చెప్పారు మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలోని మిత్రులు.తమ చిన్ననాటి మిత్రుడి కోసం వారు ఏం చేశారో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా వీరు అందరిలా స్నేహితులకు విషెస్ చెప్పడం మాత్రమే కాకుండా కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని తమకు తోచిన మేరలో ఆదుకునే ప్రయత్నం చేశారు.వివరాల్లోకెళితే.

 Friendship Viral News District Khanapuram Joint Warangal-వీరి దోస్తానా అ‘పూర్వం’..స్నేహితుడి కోసం ఏం చేశారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బోడ‌పూల్‌సింగ్‌ వెరీ క్లెవర్ స్టూడెంట్.తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద చదువుకున్న ఇతను 2002లో హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేశాడు.

ఇక ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు సెర్చ్ చేసి చివరకు ఉపాధి హామీ పథకం విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు.అంతా బాగుందనుకునే సమయంలో పూల్ సింగ్ భార్య 2018లో మరణించగా, 2019లో పూల్ సింగ్ చనిపోయాడు.దాంతో వీరి దంపతులు అనాథలయ్యారు.పూల్ సింగ్ తమ్ముడు పిల్లలు అభిలాష్, చరణ్‌ను చేరదీసి చదివిస్తుండగా, ఆ పిల్లకు సాయం చేయాలని పూల్ సింగ్ క్లాస్‌మేట్స్ నిర్ణయించుకున్నారు.ఇక ఈ విషయమై బ్యాచ్‌మేట్స్ అందరికీ ఇన్ఫామ్ చేసి రూ.10 లక్షలు వరకు కలెక్ట్ చేశారు.ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పిల్లలకు గార్డియన్‌గా ఉన్న పూల్ సింగ్ తమ్ముడికి అందజేశారు.ఈ నేపథ్యంలో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

స్నేహితుడి పిల్లల కోసం ఇంతలా ఆలోచించి నిజమైన స్నేహితులుగా పూల్ సింగ్ మిత్రులు నిలిచిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

#Friendship #Khanapuram #Joint Warangal #Friend Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు