వివి ప్యాట్ లపై చంద్రబాబు ఎందుకంత పట్టు! అసలు కారణం భయమేనా  

Chandrababu Fear About Huge Poling In Ap Elections-

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోలింగ్ తర్వాత అదే పనిగా ఢిల్లీ వెళ్తూ ప్రాంతీయ పార్టీలతో కలిసి మాట్లాడటం, వారిని వివి ప్యాట్ స్లిప్పులు లెక్కింపుపై ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు వివి ప్యాట్ లో 50 శాతం స్లిప్పులు లేక్కించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘంకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటిషన్ వేసారు.

Chandrababu Fear About Huge Poling In Ap Elections- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు -Chandrababu Fear About Huge Poling In AP Elections-

ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోనే జరుగుతుంది.చంద్రబాబు మరో సారి ఈ విషయం మీద న్యాయవాదులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్తున్నారు.

అయితే చంద్రబాబు వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎందుకు అంతగా పట్టుపడుతున్నాడు అనే విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.వివి ప్యాట్ స్లిప్పులు 50 శాతం లెక్కించాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్నారు.

దీనికి ప్రధాన కారణం తాజాగా ఎన్నికలలో జరిగిన పోలింగ్ సరళి అనే మాట గట్టిగా వినిపిస్తుంది.ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏపీలో భారీగా పోలింగ్ జరిగింది.

ప్రజలు అర్ధరాత్రి వరకు లైన్ లో నిలబడి ఓట్లు వేసారు.అయితే ఈ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగాగానే పడ్డాయని ప్రతిపక్షాలు అంటూ ఉండగా, అధికార పార్టీ సంక్షేమానికి అనుకూలంగా జరిగింది అని టీడీపీ వాదిస్తున్న లోలోపల మాత్రం భయం వెంటాడుతుంది అని.

వివి ప్యాట్ స్లిప్పులు, కొంటింగ్ లో వ్యత్యాసం వస్తే దానిని అవకాశంగా తీసుకొని ఎన్నికలు రద్దు కోరోచ్చని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ ప్లాన్ అమలు చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

Chandrababu Fear About Huge Poling In Ap Elections- Related....