వివాహంలో 'గరికె ముంత' ప్రాధాన్యత ఏమిటో తెలుసా?  

Importance Of Garika Muntha In Andhra Marriages-

వివాహంలో గరికె ముంత కు చాలా ప్రాధాన్యం ఉంటుంది.అయితే ప్రాంతాన్ని బట్టి పిలిచే పేరులో మార్పు ఉంటుంది.కానీ ప్రతి ప్రాంతంలోనూ వివాహ సమయంలో ఈ ఆచారం ఉంది.ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ… తమిళంలో కరగం అనే పేరు తోనూ… ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ, గరిగె అనే పేర్లతోనూ పిలుస్తారు.

Importance Of Garika Muntha In Andhra Marriages-

ఏ పేరుతొ పిలిచినా ఆచారం మాత్రం ఒకటే.

గరికెలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని భావిస్తారు.గరికె అంటే కుండ అని అర్ధం.అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే ….ద్రౌపది తన వివాహ సమయంలో ఆనందంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ అంటారు.అప్పటి నుంచి వివాహం సమయంలో అన్ని ప్రాంతాలలోను ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఈ గరికె ముంతను పెళ్ళికి ముందు రోజు కుమ్మరి ఇంటికి వెళ్లి కానుకలు చెల్లించి ఇంటికి తీసుకువచ్చి ఒక గదిలో ఉంచి దీపారాధన చేసి పూజలు చేస్తారు.ముందుగా ఈ గరిగెను పూజించటాన్ని గౌరి పూజగా భావిస్తారు.

వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మరల పూజ చేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు.వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది.

వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు.

LATEST NEWS