విపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు గోడమీద పిల్లులే!  

విపక్షాలు Local Political Partys-congress,elections 2019,pm Modi,rahul Gandhi,tamilanadu,మోడీ,రాహుల్ గాంధీ,లోక్ సభ

పార్లమెంటు ఎన్నికల పక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఎన్నికలు పూర్తి అవ్వగా, కౌంటింగ్‌కు రంగం సిద్దం అయ్యింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరో మూడు రోజుల్లో జరుగనుంది..

విపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు గోడమీద పిల్లులే!-విపక్షాలు Local Political Partys

పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికలు పూర్తి అయిన క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చాయి. ఎక్కువ శాతం మోడీకి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి.

మరి కొన్ని మాత్రం హంగ్‌ వస్తాయంటున్నాయి.హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటీ అనేది ఇప్పటి నుండే చర్చలు జరిపేందుకు జాతీయ పార్టీలు అయిన బీజేపీ మరియు కాంగ్రెస్‌ పార్టీలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా 25 స్థానాల కంటే ఎక్కువ ఎంపీలున్న ప్రాంతీయ పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలకు సిద్దం అవుతున్నారు.

ఈ సమయంలో ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రం గోడ మీద పిల్లి తరహాలో ఉన్నారు. ఎన్నికల ముందు వరకు కూడా స్టాలిన్‌ కాంగ్రెస్‌కు మద్దతు అంటూ, రాహుల్‌ గాంధీని సీఎం చేయాలంటూ తిరిగాడు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాము ఎటు అనే విషయంను చెబుతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇదే సమయంలో పలు ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే స్వరంతో ఉన్నారు. ఈనెల 23 తర్వాత తమ నిర్ణయంను తెలియజేస్తామంటున్నారు. మొత్తానికి హాంగ్ వస్తే ఈ గోడ మీద పిల్లులు ఎటు మొగ్గుతే అటే అధికారం ఖాయం.