ప్రతి మహిళ అందమైన,ఒత్తైన,పొడవైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే.అయితే ఆలా జుట్టు ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
జుట్టు సంరక్షణకు విటమిన్ E చాలా సహాయపడుతుంది.ఒకరకంగా చెప్పాలంటే జుట్టుకు చాలా బాగా ఉపయోగపడే పదార్ధాలలో ముందు ఉంటుంది.
విటమిన్ E ఆయిల్ జుట్టుకు మృదుత్వాన్ని,మెరుపును కలిగిస్తుంది.ఇప్పుడు విటమిన్ E ఆయిల్ ని ఎలా ఉపయోగిస్తే జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో బాదం ఆయిల్ ని వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఏర్పడుతుంది.
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో చేప నూనెను కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.
ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో ఒక స్పూన్ పెరుగు కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృదువైన,ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.