విజయ్ ఓవర్ ఆక్షన్ తగ్గించుకో - ఫిలింఫేర్ అవార్డుపై హాట్ హీరోయిన్ కామెంట్స్.!       2018-06-21   00:57:34  IST  Raghu V

ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండని అభినందిస్తూ.. ‘ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అంట కదా.. కంగ్రాట్యులేషన్ గోవింద్’ అంటూ రష్మిక ట్వీట్ చేశారు.

రష్మిక చేసిన ట్వీట్‌కి స్పందిస్తూ.. ‘‘మేడమ్, గీతా మేడమ్.. మీతో టైమ్ గడపడం నాకు నిజమైన అవార్డ్ మేడమ్. ఇలాంటి అవార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’’ అని రిప్లై ఇచ్చారు.

విజయ్ రిప్లై‌కి వెంటనే.. ‘‘ఇదిగో గోవిందం.. ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు ప్రభాస్‌కో, తారక్‌కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది’’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది.

దీనికి వెంటనే విజయ్ దేవరకొండ..‘‘అవార్డులో ఏముంది మేడమ్.. మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించటం చాలు.. గీతా మేడమ్..’’ అని రిప్లై ఇచ్చారు.

-

దీనికి రష్మికా.. ‘‘నా లాంటి వాళ్లా? వాళ్లు ఏంటి? ఆ ప్లూరల్ ఏంటి? తెలుసులే నీ గురించి.. ఒక్కరు సరిపోరు, ఎవరిని వదలవుగా..’’ అంటూ విజయ్‌పై మరో కౌంటరేసింది రష్మికా.

దీనికి.. ‘‘మేడమ్.. నా ఉద్ధేశ్యం అది కాదు మేడమ్. ఒక్కసారి నన్ను 23న కలవండి మేడమ్. అన్నీ వివరంగా చెబుతా..’’ అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు. ఇలా వీరి ట్వీట్స్‌తో ‘గీతాగోవిందం’ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.