వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఆ మెసేజ్...రెండు తెలుగు రాష్ట్రాలను షాక్ చేస్తుంది.! జాగ్రత్త.!     2018-05-21   00:34:51  IST  Raghu V

చిన్న‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి, వారి మెద‌ళ్ళ‌ను తినే ఓ ముఠా ఒక‌టి తెలుగు రాష్ట్రాల్లో సంచ‌రిస్తుంద‌న్న ఓ వాట్సాప్ మెసేజ్ తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. చాలా గ్రామాలు కంటినిండా కునుకు తీసి 20 రోజులు దాటింది. కొన్ని గ్రామాల్లో అయితే యువ‌కులు రాత్రంతా కాప‌ల‌ కాస్తున్నారు.! ఇంకొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పంద‌గా క‌నిపించే వ్య‌క్తులపై దాడికి తెగ‌బ‌డుతున్నారు. ఇది ఫేక్ న్యూస్ అని పోలీసులు నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా…..ఇవే ఫేక్ న్యూస్ వాట్సాప్ లో విప‌రీత‌మైన షేర్స్ అవుతూనే ఉన్నాయి.

-

తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గండ్వీడ్ లో …. బుడ‌గ జంగాల‌ను…, పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్ళే గ్యాంగ్ అని భావించి…ఆ గ్రామ‌స్తులు వారిని చిత‌కొట్టారు. వారు ప్ర‌యాణిస్తున్న ఆటోను త‌గ‌ల‌బెట్టారు. భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్న ఈ వార్త అబ‌ద్దం. ద‌య‌చేసి లేనిపోని భ‌యాల‌ను క్రియేట్ చేసి ప్ర‌శాంతంగా ఉన్న గ్రామాల‌ను భ‌యాందోళ‌న‌లోకి నెట్టకండి…వాట్సాప్ లో వ‌చ్చిన మెసేజ్ ను షేర్ చేసే ముందు ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించండి… అవాస్త‌వాల‌ను షేర్ చేసి లేని పోని గంద‌ర‌గోళాన్ని క్రియేట్ చేసిన వాళ్ళుగా మిగ‌ల‌కండి.

-