వర్షం వల్ల నగరం మొత్తం నీట మునిగితే...ఆ ఇద్దరు రోడ్డు మీదే ఎంత అసభ్యంగా చేసారో తెలుసా?       2018-06-11   01:04:11  IST  Raghu V

రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

దాదర్‌, పరేల్‌ టీటీ, ధారావి, కింగ్స్‌ సర్కిల్‌, కోలాబా, సియోన్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్‌ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.

ఇది ఇలా ఉంటె…మెరైన్‌ డ్రైవ్‌(క్వీన్స్‌ నెక్లెస్‌) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్‌ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌ మొబైల్‌ వ్యాన్‌ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.

పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్‌ అడిక్ట్‌ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించిన పోలీసులు.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.