వర్షం వల్ల నగరం మొత్తం నీట మునిగితే...ఆ ఇద్దరు రోడ్డు మీదే ఎంత అసభ్యంగా చేసారో తెలుసా?     2018-06-11   01:04:11  IST  Raghu V

రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

దాదర్‌, పరేల్‌ టీటీ, ధారావి, కింగ్స్‌ సర్కిల్‌, కోలాబా, సియోన్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్‌ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.