వరాలిచ్చే వరలక్ష్మి పూజకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. పూజ ఎప్పుడో తెలుసా..?

ఇంద్రకీలాద్రి పై శ్రావణ శోభ మొదలయింది.ఈ నెల 17 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస మహోత్సవాలు వైభవంగా మొదలుకానున్నాయి.

 Kanaka Durga Temple Ready For Varalakshmi Puja.. Did You Ever Know The Pooja..?-TeluguStop.com

ఈ నెల 25వ తేదీన వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరాలిచ్చే వరలక్ష్మి దేవి( Varalakshmi Devi )గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అంతే కాకుండా సెప్టెంబర్ నెల 8 నుంచి ఇంద్రకీలాద్రిపై అర్జిత సేవగా సామూహిక వరలక్ష్మి పూజలు మొదలుకానున్నాయి.

ఈ సామూహిక వరలక్ష్మి పూజలో ఎక్కువమంది భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తూ ఉంది.

Telugu Andhra Pradesh, Bhakti, Devitional, Devotees, Devotional, Kanakadurga, Po

ఈ సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొనే భక్తులు పూజకుగాను 1500 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ పూజలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని సామూహికంగా వరలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు.ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఎప్పటిలాగానే ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు ఈ వ్రతం జరుగుతుంది.సామాన్య భక్తుల( Devotees ) కోసం ప్రత్యేకంగా 500 రూపాయలు టికెట్ తో 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉత్సవమూర్తుల ఎదురుగా జరుగుతాయి.

Telugu Andhra Pradesh, Bhakti, Devitional, Devotees, Devotional, Kanakadurga, Po

అంతేకాకుండా ఉచితంగా సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొనే భక్తుల కోసం కూడా సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు పేర్లు నమోదు చేసే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు.శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి( Purnima ) ముందు వచ్చే శుక్రవారం గా జరుపుకోవడం మన హిందూ సంప్రదాయం.అలాగే హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది.

దీన్ని వివాహమైన మహిళలు కచ్చితంగా పాటిస్తారు.వరాలు ఇచ్చే వరలక్ష్మి దేవికి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేస్తే పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటూ అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు.

ఇదే విషయాన్ని శివుడు పార్వతి దేవికి చెప్పినట్లుగా స్కంద పురాణంలో కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube