వచ్చే ఏడాదిలో 5 మల్టీస్టారర్‌లు     2018-05-27   22:30:46  IST  Raghu V

తెలుగు పరిశ్రమలో ఈ మద్య వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాల ప్రకటన చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితితో చూస్తే ప్రస్తుతం మల్టీస్టారర్‌ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోల మల్టీస్టారర్‌లు చేసేందుకు అప్పట్లో ఆసక్తి చూపించే వారు కాదు. తమ అభిమానులను దృష్టిలో పెట్టుకుని వారు ఇతర హీరోలతో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. దాంతో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తర్వాత మల్టీస్టారర్‌లు పెద్దగా రాలేదు. ఆ లోటును మళ్లీ ఇప్పుడు తీర్చబోతున్నారు.

ఈతరం స్టార్‌ హీరోలు చాలా స్నేహంగా మెలుగుతున్నారు. స్టార్‌ హీరోలు అంతా కూడా స్నేహ వాతావరణంలో ఉన్నారు. దాంతో వారు మల్టీస్టారర్‌లకు ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమానులు సోషల్‌ మీడియాలో ఫైట్‌ చేస్తున్నా కూడా ఆయా హీరోలు మాత్రం సందర్బానుసారంగా కలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా పలువురు స్టార్‌ హీరోలు కలిసిన విషయం తెల్సిందే. అందుకే ఇకపై వరుసగా మల్టీస్టారర్‌లు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జక్కన్న మల్టీస్టారర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కలయికలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రతి సీన్‌, ప్రతి పాత్ర కూడా అద్బుతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో జక్కన్న స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.