వంగవీటి రాధాకి భారీ షాక్..టీడీపీ లోకి       2018-05-23   02:37:17  IST  Bhanu C

ఏపీలో పొలిటికల్ హీట్ నేతలకి ముర్చెమటలు పట్టిస్తున్నాయి..ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు నేతల వెన్నులో వణుకు రేపుతున్నాయి..అసలు సిసలైన రాజకీయ చదరంగం మొదలు పెట్టేశారు నేతలు..వైసీపి కృష్ణా జిల్లాలో సైకిల్ జోరుకు కట్టడి వేయాలని చూస్తుంటే టీడీపి మాత్రం వైసీపి రెక్కల్ని విరిచేసే విధంగా ప్రతి వ్యుహాలని పన్నుతోంది..ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను దెబ్బతీసేలా వారి అనుచరులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

అయితే అందులో భాగంగా కృష్ణా జిల్లాలో దివంగత నేత వంగవీటి రంగా బావమరిది, వంగవీటి రాధాకు మేనమామ అయిన చెన్నుపాటి శ్రీను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఎత్తులకి పై ఎత్తులు వేస్తోంది..పార్టీలోకి రంగా బావ మరిదిని చేర్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు…అంతేకాదు రంగా కుటుంభం లోని ముఖ్యలని సైతం పార్టీలోకి చేర్చుకుని రాధా ని దెబ్బకొట్టాలని ఎదురు చూస్తోంది.

అయితే వంగవీటి రంగా రాజకీయాల్లో వున్న సమయంలో ఎంతో క్రియాశీలంగా ఉన్న తన బావ శ్రీను రంగా మరణం తరువాత మాత్రం సైలెంట్ అయిపోయారు…అయితే ఎన్నికల తరుణంలో ఆయన వైసీపిలోకి చేరుతారు అని ప్రచారం కూడా జరిగింది..అయితే ఇప్పుడు ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అందుతోంది..

చెన్నుపాటి శ్రీను ను టిడిపిలోకి తీసుకురావడానికి విజయవాడ అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మరియు సెంట్రల్ ఎమ్మెల్యే సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ లు ఎంతో కృషి చేస్తున్నారు. పార్టీలోకి శ్రీను ని తీసుకు రావడానికి ఎన్నో రాగాలుగా కృషి చేస్తున్నారు..అయితే శ్రీను గనుకా టీడీపీ వెళ్తే రంగా తనయుడు రాధా ని రాజకీయంగా దెబ్బకొట్టడంలో టీడీపీ నేతలు సక్సెస్ అయినట్టే అంటున్నారు విశ్లేషకులు..మరి శ్రీను నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే..