లైసెన్స్ మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ -ఎస్సై సిహెచ్.నరేష్

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాల బారినపడి నిత్యం వందల మంది యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ట్రాఫిక్ ఎస్ఐ సీహెచ్.నరేష్ తెలిపారు.

 Vehicles Without License And Number Plate Are Under Siege By Essay Ch Naresh-TeluguStop.com

శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్,అతివేగం,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం,మద్యం మత్తులో వాహనాలు నడపటంవల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపించినా,తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చినా,వాహనాలకు ఇన్సూరెన్స్ లేకున్నా చట్టపరమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుండి మార్చి 31 తేదీ వరకు నిర్వహించే ఆన్‌లైన్ ఈ చలానా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.గత రెండు సంవత్సరాల నుండి కరోనా లాక్ డౌన్ సందర్బంగా పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఆర్థికంగా నష్టపోవడం వల్ల అట్టి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని 2W/3W – పే 25%, బ్యాలెన్స్ 75% మాఫీ, ఆర్టీసీ డ్రైవర్స్- పే 30%, బ్యాలన్స్ 70% మాఫీ, LMV/ HMV – పే 50%,బ్యాలన్స్ 50% మాఫీ, పుష్ కార్ట్ వెండోర్స్ – పే 25%,బ్యాలన్స్ 75% మాఫీ,నో మాస్క్ కేసుల్లో- పే రూ.100,బ్యాలెన్స్ రూ.900 మాఫీ,నెలరోజులు పాటు ఈ వెసులుబాటు ఉంటుందని,అంటే మార్చి 1 నుండి మార్చి 31 వరకు ఎప్పుడైన ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చలానా క్లియర్ చేసుకోవచ్చన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube