లాస్ఏంజెల్స్ లో 13 మంది పిల్లల్ని ఇంటిలో బంధించి నరకం చూపిస్తున్న కన్నతల్లితండ్రులు...  

జోర్డాన్ తర్పిన్ అనే 17 సంవత్సరాల అమ్మాయి తల్లి తండ్రులు ఇంటిలో లేని సమయంలో 911 కి ఫోన్ చేయడం తో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది.జోర్డాన్ ని ఫోన్ లో ప్రశ్నించగా తనతో 13 మంది చెల్లెలు,తమ్ముళ్లు ఉన్నారు అని చెప్పింది. ఇంతవరకు వారు ఎవరు ఇంటి నుంచి బయటకి రాలేదని వాళ్ళ తల్లితండ్రులు వారిని ఇంట్లోనే ఉంచి ఆహారం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు అని చెప్పింది.తన ఇద్దరు చిన్న చెల్లెల్ని,తమ్ముడ్ని గొలుసులతో బెడ్ కి కట్టి బాధపెట్టటం వాళ్ళ తాను వాళ్ళందరిని కాపాడుకోవటానికి ఇంటిలో ఎవరు లేని సమయం లో పోలీస్ లకి ఫోన్ చేసినట్లుగా చెప్పింది..

లాస్ఏంజెల్స్ లో 13 మంది పిల్లల్ని ఇంటిలో బంధించి నరకం చూపిస్తున్న కన్నతల్లితండ్రులు...-

ఇల్లు శుభ్రంగా లేకుండా ఉండటం వలన ఒకోసారి నిద్ర లేవగానే ఊపిరి ఆడక బాదేపడేది అని తెలిపింది.పోలీస్ స్నానం చేసి ఎన్ని రోజులయింది అని అడుగగా జోర్డాన్ సంవత్సరం అయి ఉండొచ్చు, మురికిగా అనిపించినప్పుడు మొహం, జుట్టు నీళ్లతో మాత్రం కడిగేది అని చెప్పింది.

స్కూల్ కి వెళ్తున్నారా అని అడుగగా మా అమ్మ హోమ్ స్కూల్ మరియు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారు అని చుట్టు పక్కల వాళ్ళకి చెప్పేది కానీ నేను 17 సంవత్సరాలు ఇంతవరకు ఫస్ట్ గ్రేడ్ పూర్తి అవలేదు అని చెప్పింది.ఇంకా మా అమ్మ గురించి అంతగా నాకు తెలియదు మేము అంటే మా అమ్మ కి ఇష్టం లేదు,మాతో ఎప్పుడు సమయం గడిపేది కాదు అని చెప్పింది.

ఇంటి అడ్రస్ అడుగగా నేను బయటకి ఎప్పుడు వెళ్ళలేదు అని, ఇంటి బయట ఎలా ఉంది, ఏమి ఉన్నది తెలియదు అని చెప్పింది. చుట్టు పక్కల వాళ్ళు అర్ధరాత్రి 2 గంటల సమయం లో పిల్లలు మార్చింగ్ చేస్తున్నట్టుగా నడుస్తూ ఉండేవారని తెలిపారు.

జోర్డాన్ చేసిన ఫోన్ ఆధారంగా పోలీస్లు వారి ఇంటిని చేరుకొని ఆ తల్లితండ్రుల్ని అరెస్ట్ చేసి పిల్లల్ని కాపాడారు.

వారికి యావజ్జీవ శిక్ష పడవచ్చు అని పోలిసుల అభిప్రాయం.

ఇన్ని సంవత్సరాలకి ఆ అమ్మాయి తన చెల్లెలు,తమ్ముడ్ని తన దైర్యం తో కాపాడుకోగలిగింది.